భార్యతో కలిసి ఆ పని చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ హీరో
ఈ సంవత్సరం ప్రారంభంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ "ప్రజలు నన్ను ఊహించుకున్నంత ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నాకు 50 ఏళ్లు. అనిల్ కపూర్ నా కంటే ఫిట్‌గా ఉన్నారని, అతను అద్భుతమైన వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. అయితే నా భార్య కూడా నన్ను బరువు తగ్గమని అడుగుతూ ఉండేది. ఒకరోజు ఒక సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు నేను బరువు తగ్గినట్టు నా భార్యకు చెబితే ఆమె అస్సలు నమ్మలేదు. అప్పుడు ఫోటో దిగి పంపాను. అప్పుడు నేను చెన్నై లో సినిమా చిత్రీకరణలో ఉన్నాను" అని తన వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పారు. కాగా మాధవన్, సరితా బిర్జే 8 సంవత్సరాల పాటు డేటింగ్ చేసి, ఆ తర్వాత 1999 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.
మాధవన్ సినిమాల విషయానికొస్తే తన తదుపరి రొమాంటిక్ కామెడీ మూవీ "డికప్ల్డ్"తో విడుదలకు సిద్ధమవుతున్నాడు. ఇందులో సుర్వీన్ చావ్లా కూడా ఉన్నారు. హార్దిక్ మెహతా దర్శకత్వం వహించిన ఈ షో డిసెంబర్ 17న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది.