గుట్టుచప్పుడుగా పెళ్లి.. పిల్లలతో షాక్ ఇచ్చిన నటి..!!

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో నటి శ్రీయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చిత్ర పరిశ్రమలో గత దశాబ్దాలుగా శ్రీయ హీరోయిన్ గా రాణిస్తుంది. ఆమె నటనతో దక్షిణాది చిత్ర పరిశ్రమలను రాణించారు. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఇండస్ట్రీకి ఇష్టం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.
అంతేకాదు.. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న విశేష ఆదరణ దక్కించుకుంది ఈ భామ. అయితే శ్రీయ ఇప్పటికీ ఎన్నో చిత్రాలలో పలు కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి అందరికీ తెల్సిందే.
ఇక ఇదిలా ఉండగా శ్రీయ 2018లో రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రూ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెల్సిందే. అయితే శ్రీయ ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. అంతేకాదు.. పెళ్లి అనంతరం ఆమె పెళ్లి విషయాన్ని బయటపెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురైయ్యారు. అయితే శ్రీయ పెళ్లి రహస్యంగా చేసుకోవడానికి గల కారణం తన పెళ్లి ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చేసుకోవాలనే కోరిక ఉండటం వల్ల తన పెళ్లిని రహస్యంగా చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
అయితే వీరి వివాహం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఆమె పెళ్లి విషయం తర్వాత వెల్లడించే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన శ్రీయ తన కూతురి విషయంలో కూడా ఇలాంటి ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక కరోనా సమయంలో ఆమె ప్రెగ్నెంట్ కావడం వల్ల తన గర్భవతి అనే విషయాన్ని ఎక్కడా తెలుపలేదు. ఈ తరుణంలోనే తన కూతురు రాధా సంవత్సరం పాప అయిన తర్వాత తన కూతురి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: