సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం
సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు .
సిరివెన్నెల అంత్యక్రియలకు
టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ హాజరయ్యారని తెలుస్తుంది.అయితే మోహన్ బాబు ఫ్యామిలీ హీరోలలో ఒక్కరు కూడా 'సిరివెన్నెల' భౌతికకాయం చూడటానికి హాజరు కాలేదట.
మంచు ఫ్యామిలీ ఎందుకు రాలేదని చాలామందికి అనుమానాలు వ్యక్తమయ్యాయని సమాచారం. అయితే తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు భౌతిక కాయం చూడటానికి హాజరు కాకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారట.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో
ఇండస్ట్రీ పెద్ద దిక్కుని కోల్పోయిందని మోహన్ బాబు అన్నారట. అయితే మా ఇంట్లో కూడా తమ్ముడి మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయని ఆయన వెల్లడించారట.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించిన సమయంలో మా ఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లకూడదని అందుకే తన కుటుంబ సభ్యులకు ఎవరినీ వెళ్లొద్దని తాను చెప్పానని మోహన్ బాబు వెల్లడించారట.సిరివెన్నెల సీతారామశాస్త్రిని కొన్ని రోజులకు
ఇండస్ట్రీ మరిచిపోతుందని అయితే ఆయన రాసిన పాటలను మాత్రం ముందు తరాల వాళ్లు కూడా వింటారని మోహన్ బాబు పేర్కొన్నారట.
సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని మోహన్ బాబు అన్నారట.. గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆ విషాదాలు తనను బాధ పెడుతున్నాయని మోహన్ బాబు పేర్కొన్నారట.. మరోవైపు మోహన్ బాబు పరిమితంగా సినిమాలలో నటిస్తుండగా ఆయన నటించిన సన్నాఫ్
ఇండియా సినిమా త్వరలో రిలీజ్ కానుందట.ఈ సినిమాతో మోహన్ బాబు హిట్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉందట. మోహన్ బాబు తనకు పేరు తెచ్చిపెట్టే సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారని తెలుస్తుంది.