ఆచార్య సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపిన కొరటాల శివ..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా లలో ఆచార్య సినిమా ఒకటి, ఈ సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జంటగా నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మ కంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర లో కనిపించబోతున్నాడు, ఈ సినిమా లో రామ్ చరణ్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను, టీజర్ లను, పాటలను చిత్ర బృందం విడుదల చేయ గా వీరికి జనాల నుండి అదిరి పోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, ఈ సినిమా పై ఉన్న అంచనాలను మరింత గా పెంచేశాయి.

 ఇది ఇలా ఉంటే తాజా గా ఈ సినిమా లో రామ్ చరణ్ కు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం బయటికి వదిలింది, ఈ టీజర్ కు జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది, ఇప్పటికే జనాలలో మంచి అంచనాలను కలిగి వున్న ఈ సినిమా ను ఏప్రిల్ 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం అఫీషియల్ గా తెలియజేసింది. ఇది ఇలా ఉంటే తాజా గా ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య' సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు... అందులో భాగంగా కొరటాల శివ మాట్లాడుతూ...   మొదటగా చిరంజీవి కి ఈ కథను చెప్పినప్పుడు ఈ కథ చాలా బాగుంది మంచి కమర్షియల్ కథ  అని చెప్పాడు. చిరంజీవి లాంటి స్టార్ హీరో ఈ కథను ఒప్పుకోవడంతో ఈ కథ లో ఉన్న కమర్షియల్ టీతో పాటు, చిరంజీవి ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకొని, చిరంజీవి అభిమానులను దృష్టి లో పెట్టుకుని ఈ కథను పూర్తిగా రాయడం జరిగినట్లు కొరటాల శివ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: