అఖండ : శ్రీకాంత్ పాత్ర మునిగిపోయిందా?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే సినిమా గురించి చర్చ జరుగుతుంది. అదే ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా గురించి.  బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో రెండు సూపర్ హిట్ సినిమాలు ఉండటంతో ఇక ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు భావించారు. అయితే మొదటి నుంచి భిన్నమైన టాక్ సొంతం చేసుకుంటూ ఉంది. బాలయ్య అఖండ సినిమా ఎందుకో ఊహించినంతగా ప్రేక్షకులందరూ ఏమాత్రం ఆకట్టుకోలేక పోతుంది అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.

 ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఎలా ఉంటుందో అని చూసిన ప్రేక్షకులు ఎంత మంది ఉన్నారో శ్రీకాంత్ బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో ఎలా కనిపించ పోతున్నాడు అని ఆసక్తితో సినిమా చూసిన ప్రేక్షకులు కూడా అంతే మంది అని చెప్పాలి. అయితే గతంలో బాలయ్య సినిమాలో ఒకప్పటి సాఫ్ట్ హీరో జగపతి బాబు విలన్ పాత్రలో నటించి ఇక టాలీవుడ్ లో ఒక్క సారిగా క్లిక్ అయిపోయారు. ఇక ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ పాత్రల్లో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు.

 అయితే ఒకప్పుడు బాలయ్య సినిమాలో జగపతిబాబు పాత్ర సెట్ అయినట్లుగానే అఖండ సినిమాలో శ్రీకాంత్ పాత్ర కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది అని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ ఎందుకో బాలయ్య రేంజ్ లో శ్రీకాంత్ పాత్ర మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. శ్రీకాంత్ క్యారెక్టర్ కు ఎక్కువ స్కోప్ ఉండదట. ఇక శ్రీకాంత్ పాత్రను బోయపాటి తెరకెక్కించిన తీరు కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుందట. ఇలా విలన్ పాత్రలో నటించిన శ్రీకాంత్ క్లిక్ అవ్వలేకపోయాడు అని ప్రస్తుతం కొంత మంది ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: