ఫ్యాన్స్ ను నిండా ముంచిన బోయపాటి.. ఇదేంటి బాలయ్య..!!

P.Nishanth Kumar
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ  చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాస్ సినిమాగా ప్రేక్షకులను ఎంతగానో అలరించడానికి ఈ రోజు ఎన్నో అంచనాల తో విడుదల అయిన ఈ చిత్రం మిశ్రమ స్పందన అందుకుంటూ  ముందుకు వెళుతుంది. మొదటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను మాస్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఈ సినిమాతో ఏర్పరుచుకోగా ఆయన గతంలో పొందిన పరాభవాన్ని తుడిచి పెట్టుకోవాలని భావించాడు.

కానీ దానికంటే ఎక్కువ పరాభవాన్నీ ఇప్పుడు అఖండ సినిమా విషయంలో పొందుతున్నాడు బోయపాటి శ్రీను. ఆయన గత నాలుగైదు సినిమాలలో చూపించిన విధంగా నే అదే అతి అదే ఓవర్ యాక్షన్ తో బోయపాటి శ్రీను చేసిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా లేదని ఇప్పుడు విమర్శలు అందుకుంటున్నాడు. దర్శకుడిగా ఆయన ఎలా ఉన్నా కూడా రచయితగా ఈ మధ్య కాలంలో మంచి కథలు రాయడం లేదనేది ఎక్కువగా వినిపిస్తున్న వాదన. ఈ నేపథ్యంలో ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుందని అందరూ భావించారు. 

కానీ మాస్ ను అలరించే అంశాలు తప్ప ఈ చిత్రం లో పెద్దగా ఏమీ లేదని చూసిన వారు చెబుతున్నారు. ఇకపోతే బాలకృష్ణ కూడా వరుస ప్లాపులు వస్తున్న సమయంలో మంచి కథలను ఎంచుకుని సినిమాలు చేయాలి కానీ ఈ విధంగా అభిమానులను నిరాశ పరిచే కథలను ఎంచుకోవడం పట్ల ఆయన నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు నందమూరి అభిమానులు. ఈ సినిమా లో తను ఎలివేషన్ అయ్యే సీన్ లే కాకుండా  ఈ సినిమా కథ తెరకెక్కిన విధానం పై బాలయ్య ఫోకస్ చేయలేదని వారు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేయబోయే తదుపరి సినిమా పై ఇప్పుడు ఎంతో ప్రెషర్ నెలకొంది అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: