అఖండ : ఓ రంగుల పండుగ

Vennelakanti Sreedhar

..... చికెన్ చీకులు, మటన్ కబాబులు, చేప ఫ్రై, ఉలువలు, ఇత్తులు, శెనిగెలు కూడా ఉన్నాయ్ బావా.... నువ్వు దంచు... అసలే పొద్దాడి కల్లు... నా కళ్ళలోకి చూసింది చాలు, కల్లు బింకి ఖాళీ చేయి... రాకే చేత్తో పడితే చాలు... బింకీ ఖల్లాస్... కమాన్...
.జై బాలయ్యా... అని ప్రముఖ పాత్రికేయులు ఎం.ఎస్.ఆర్ ఈ చిత్రం గూర్చి ఒక సందర్భంలో ముచ్చటించారు. అది కామెంటా.. కాంప్లిమెంటా...  ఈ వాక్యాలు ఇమిటేషనా లేక కొటేషనా అన్న చర్చను కాస్త పక్కన పెడదాం.
నందమూరి అందగాడు బాలకృష్ణ నటించిన సినిమా అఖండ తెలుగు సినీ ప్రేక్షకులకు ఓ రంగుల పండుగనిచ్చింది. రౌద్రం పెల్లుబికే సినిమాలు చేయడంలో బాలకృష్ణది  అందవేసిన చెయ్యి. ఒక్క మాటలో చెప్పాలంటే నందమూరి  తారక రామారావు తరువాత అంత రౌద్రాన్ని పలికించడం ఎన్టీయార్ తరువాత బాలకృష్ణకే సొంతమైంది. ఆయన సినిమాలలో పలికించిన రౌద్రం మరే ఇతర సమకాలీన నటుడు పలికించ లేడంటే అతిశయోక్తి లేదు. బాలకృష్ట నటించిన మహా నాయకుడు, కథానాయకుడు, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి....ఒకటా రెండా... ఈ మంగమ్మ గారి మనవడు నటించిన చిత్రాలలో రౌద్రమే ప్రధానాకర్షణ. దీనిని వెటకారంగా తీసుకుంటారా?, లేక మమకారంగా తీసుకుంటారా? అన్నది మీ ఇష్టం.

కాస్త వైవిధ్యం... కొంత కొత్తదనం కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు బోయపాటి.  ఈ సినిమా కూడా రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని వెండి తెరపై పరిచయం చేసిన సినిమా. అనంతపురానికి చెందన ఓ రైతు పాత్రలో బాలకృష్ణ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. కత్తులు దూసుకునే కసాయి తనానికి చిరునామా ఉన్న రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని నిలువరించి, అందరి చేతసేద్యం చేయిస్తుంటాడు. హీరోయిజం ఉన్న వ్యక్తిగా  తమ పరిసర ప్రాంతాలలో పేదలకు వైద్య సదుపాయాలు కల్పించేదుకు ఆసుపత్రులు కట్టిస్తాడు ఈ సినిమా  కథానాయకుడు.  తన చర్యలతో ఏకంగా జిల్లా కలెక్టరమ్మనే ప్రేమలో పడేస్తాడు హీరో... కట్ చేస్తే..
సినిమా ఆరంభంలో బాలకృష్ణ ఎంట్రీ కూడా మాస్ మసాలాను తలపిస్తుంది. ఉరుకులు తీస్తూ, రంకెలేస్తున్న ఎద్దుల మధ్య నుంచి హీరో పాత్రధారి బాలకృష్ణ  ఎంటరవడం నందమూరి అభిమానుల్లో అంతులేని ఉత్సాహాన్ని నింపుతుంది. పంచ్ డైలాగ్ లతో వార్నింగ్ లు ఇవ్వడం,  జనాల్ని ఎత్తి కుదెయ్యడం ఇత్యాది దృశ్యాలు అభిమానుల్లో జోష్ ను నింపాయి.
ఈ సినిమాలో నటుడు శ్రీ కాంత్ ది ప్రతినాయకుడి పాత్ర. ఆయన ఈ సినిమాలో విలన్ గా ఇమడ లేక పోయాడని చెప్పవచ్చు.  హవ భావ ప్రదర్శన లోనూ, ఉద్వేగాలను వెలిబుచ్చడంలోనూ శ్రీకాంత్ వెనుకబడినట్లు కనిపిస్తోంది.  ఇక హీరోయిన్  ప్రజ్ఞా జైస్వాల్ చాలా సాదాసీదాగా కనిపించినా డైలాగ్ డెలివరి ప్రేక్షకులను ఆకట్టుకో లేక పోయారన్నది సుస్పష్టం.  తమన్ సంగీతం గూర్చి వేరే చెప్పాలా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: