విక్కీ కౌశల్ తీసుకున్న ఇంటి అద్దె అన్ని కోట్లా..?

Divya
ముంబై లోని అత్యంత ఖరీదైన ఒక ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో రెండు సెలబ్రిటీ జంటలు కాపురం ఉండబోతున్నాయి.. ఇప్పటికే భార్యాభర్తలు అయిన ప్రముఖ క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఆ అపార్ట్ మెంట్ లో కాపురం పెట్ట, త్వరలోనే ఒక్కటి కాబోతున్న విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ కూడా అదే అపార్ట్మెంట్లో కాపురం పెడుతూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ఆ అపార్ట్ మెంట్ లో అనుష్క - విరాట్ కోహ్లీలు రెండు ఫ్లోర్ లో నివాసం ఉంటుండగా ఇక అదే అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్ ను విక్కీ కౌశల్ రెంట్ కి తీసుకున్నారు.. వివాహం అనంతరం అక్కడే కాపురం పెట్టబోతున్నారని సమాచారం.
అపార్ట్మెంట్ లో కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ రెంట్ తీసుకున్నది ఎనిమిదవ ఫ్లోర్.. ఆ ఇంటి కి రెంట్  నెలకు అక్షరాల 8 లక్షల రూపాయల నుంచి మొదలవుతుందట. ఇకపోతే మూడు సంవత్సరాల గాను వీరు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి సంవత్సరం నెలకు ఎనిమిది లక్షల రూపాయలు కాగా, రెండవ సంవత్సరం నుంచి నెలకు 50 వేల రూపాయలు ఎక్కువ అవుతుంది అంటే రెండవ సంవత్సరంలో 8 లక్షల 50 వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.. ఇక మూడవ సంవత్సరం మరో 40 వేల రూపాయల మొత్తాన్ని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే మూడో సంవత్సరం వచ్చేసరికి నెలకు రూ.8 లక్షల 90 వేల రూపాయలను ఇంటి అద్దెగా కట్టాలన్నమాట.
అగ్రిమెంట్ కోసం విక్కీ కౌశల్ కోటి 75 లక్షల రూపాయల మొత్తాన్ని ఒకేసారి చెల్లించాడు అని రియాల్టీ సంస్థ సమాచారం ఇచ్చింది. ఇక ఒక ఇంటికి ఎనిమిది లక్షల రూపాయల కంటే ఎక్కువ రెంట్ కడుతున్నారు అంటే ఆ ఇల్లు ఎంత లగ్జరీగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉండదు.. ఇక ఈ నెలలోనే వీరిద్దరూ రాజస్థాన్ ప్యాలెస్లో ఒకటి కాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: