విక్టరీ
వెంకటేష్ నటించిన 'దృశ్యం 2'
సినిమా తాజాగా
అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో
వెంకటేష్ సరసన సీనియర్
హీరోయిన్ మీనా నటించింది. ఇక ఈ సినిమాలో
వెంకటేష్ ఇంటి పక్కన
భర్త చేతిలో వేధింపులకు గురయ్యే
సరిత పాత్రలో నటించిన నటి అద్భుతమైన నటనను కనబరిచింది. అంతేకాదు అండర్ కవర్
పోలీస్ ఆఫీసర్ గా ఉంటూ ఈ పాత్ర చేసిన ఈమెకి సినిమాలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే ఈ నటి ఎవరు అని
సినిమా చూసిన వాళ్ళంతా ఆరా తీస్తున్నారు. అయితే ఈమె ఒక పెద్దింటి కోడలట. కష్టపడి ఎదిగి మంచి పేరు సంపాదించుకుంది.
తమిళ్ బిగ్ బాస్
హౌస్ లో మొదలైన ఈమె ప్రయాణం నటిగా గుర్తింపు తెచ్చుకునే స్థాయి వరకు వెళ్ళింది. దృశ్యం 2 సినిమాలో
సరిత పాత్రలో నటించిన ఈ నటి పేరు సుజా వరుని. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల కళ్ళు తన వైపు తిప్పుకునే ఎలా చేసింది ఈ నటి. దీంతో ఈమె నటన కి సోషల్
మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. దీంతో ఈ నటి ఎవరు అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. ఈమె అసలు పేరు సుజాత.
తమిళ ప్రఖ్యాత నటుడు
శివాజీ గణేషన్ మనవడు అయిన
శివాజీ దేవ్ ని ప్రేమించి
పెళ్లి చేసుకుంది సుజా వారుణి. ఈమె కంటే ఈమె
భర్త ఐదేళ్ల చిన్నవాడు. అయినా కూడా ప్రేమించి అతని
పెళ్లి చేసుకుంది.
వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక నటిగా 2002లో సుజా వారుణి తన కెరియర్ను మొదలు పెట్టింది. ఈ క్రమంలో 'ప్లస్ 2' అనే
తమిళ సినిమాతో ఆరంగేట్రం చేసింది. అంతేకాదు తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది. గుండెల్లో గోదారి, ఆలీబాబా ఒక్కడే దొంగ, నాగవల్లి, దూసుకెళ్తా సినిమాలలో కొన్ని చిన్న చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత
తమిళ బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొని ఏకంగా 13 వారాలు
హౌస్ లో ఉండి పాపులర్ అయిపోయింది. ఇక ప్రస్తుతం దృశ్యం 2 సినిమాతో అద్భుతమైన నటనను కనబరిచి మంచి పేరుని సంపాదించుకుంది. ఇక ఈ సినిమాతో సుజా వారుణి కి వరుస అవకాశాలు వస్తున్నాయి...!!