బంపర్ ఆఫర్ కొట్టేసిన లావణ్య త్రిపాఠి..!
లావణ్య త్రిపాఠికి 'శ్రీరస్తు శుభమస్తు' తర్వాత పెద్దగా హిట్స్ లేవు. మధ్యలో 'అర్జున్ సురవరం' సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినా, లావణ్య కెరీర్‌కి బూస్టప్ రాలేదు. ఇక కొంచెం సీరియస్ రోల్ ప్లే చేసిన 'చావు కబురు చల్లగా' సినిమాకి నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత లావణ్య కూడా బ్రేక్ తీసుకుంది.
లావణ్య సినిమాలు తగ్గించేసరికి ఈమె కెరీర్ క్లైమాక్స్‌కి చేరిందనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా లావణ్య త్రిపాఠికి మహేశ్ బాబు సినిమాలో ఆఫర్ వచ్చిందట. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబోలో ఒక సినిమా వస్తోంది. 'అతడు, ఖలేజా' తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై మంచి హైప్స్ ఉన్నాయి. ఈ సినిమాలో లావణ్యని సెకండ్ హీరోయిన్‌గా తీసుకున్నారట.
త్రివిక్రమ్, మహేశ్ బాబు సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇక సెకండ్ హీరోయిన్‌గా నభ నటేశ్‌ని తీసుకుంటున్నారని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు లావణ్యని పరిశీలిస్తున్నారనే టాక్ వస్తోంది. మరి ఈ సెకండ్ హీరోయిన్ రోల్‌తో లావణ్య త్రిపాఠి కెరీర్ మళ్లీ ట్రాక్ ఎక్కుతుందా అన్నది చూడాలి. లావణ్యకు మాత్రం ఆల్ ది బెస్ట్ చెబుదాం.