దృశ్యం 3,4,5, 6 కూడానా...!
చివరకు వెంకీ క్యారెక్టర్ ను ఎంత ప్రామిసీంగా తెరకెక్కించారు అంటే కేవలం దృశ్యం 2 మాత్రమే కాదు… 4, 5, 6… ఇలా ఎన్నొచ్చినా, రాంబాబు తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఎన్ని ఎత్తులు , పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉంటాడురా అన్నంత నమ్మకాన్ని దర్శకుడు బలంగా కలిగించాడు. ఈ సినిమా చూసి బయటకు వచ్చాక రేపటి రోజున దృశ్యం 3 సినిమా వచ్చినా కూడా క్లైమాక్స్ మాత్రం ఎలా ఉంటుందో ? ప్రేక్షకుడు ముందే ఊహించు కోగలడు.
ఇక వెంకీ చాలా నేచురల్ గా చేసిన నటన కూడా సినిమా కు ప్రాణం పోసింది. అయితే ఈ నటనను మళయాళంలో చేసిన మోహన్ లాల్ నటనతో అయితే సరి పోల్చి చూడలేం. ఇక మీనా కూడా ఎప్పటి లాగనే పద్ధతి అయిన పాత్రలో కనింపించింది. తొలి భాగం తో పోలిస్తే.. ఈ పార్ట్ 2 లో పిల్లల భాగస్వామ్యం చాలా తక్కువ నే చెప్పాలి. ఇక క్యారెక్టర్ల ను బేస్ చేసుకుని రాసుకున్న సినిమా కాదు. కథే పాత్రలను నడిపించింది.