ఆ పనికి ఒప్పుకునే హీరోయిన్లకు డబ్బులే డబ్బులు..!

NAGARJUNA NAKKA
కలువకళ్ల సుందరి కాజల్‌ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తోంది గానీ, మనుపటిలా బ్యాక్‌ టు బ్యాక్‌ ఆఫర్స్ రావడం లేదు. సీనియర్ల సినిమాలతోనే సర్దుకుంటోంది. అయితే ఈ చందమామ కూడా హీరోయిన్‌గా బిజీగా ఉన్న టైమ్‌లో ఐటెమ్ సాంగ్ చేసింది. 'జనతాగ్యారేజ్' లో పక్కాలోకల్‌ అంటూ నాటు స్టెప్పులేసింది కాజల్. ట్రెండ్‌ని క్యాష్‌ చేసుకునే వాళ్ల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ట్రెండ్‌కి తగ్గట్లుగా కెరీర్‌ని కూడా డిజైన్ చేసుకుంటే, కోట్లు సంపాదించొచ్చని బిజినెస్‌ ఎనలిస్టులు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. చాలామంది హీరోయిన్లు ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఐటెమ్‌ సాంగ్స్‌తో బ్యాంక్‌ బ్యాలెన్స్ పెంచుకుంటున్నారు.
సమంత కెరీర్‌ స్టార్ట్ చేసి 10 ఏళ్లు దాటింది. ఈ లాంగ్‌ కెరీర్‌లో ఒక్కసారి కూడా స్పెషల్‌ సాంగ్స్‌ వైపు వెళ్లలేదు సామ్. అయితే మొదటిసారి 'పుష్ప' సినిమాలో మసాలా సాంగ్‌ చేస్తోంది. సుకుమార్‌ డైరెక్షన్‌లో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీలో సామ్‌ ఐటెమ్‌ సాంగ్‌ చేస్తోంది. ఇక ఈ సాంగ్‌కి సమంత భారీగా రెమ్యూనరేషన్‌ తీసుకుంటోందనే టాక్ వస్తోంది. తమన్నా థర్టీ క్రాస్‌ చేశాక అవకాశాలు తగ్గిపోయాయి. టాప్ హీరోలు ఎక్కువగా పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి వాళ్లనే ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో బిజీగా ఉండడానికి ఐటెమ్ సాంగ్స్‌ కూడా చేస్తోంది. హీరోయిన్‌గా నటిస్తూనే 'అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశ, కెజిఎఫ్-చాప్టర్1, సరిలేరు నీకెవ్వరు' లాంటి సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌ చేసింది మిల్కీ.
పూజా హెగ్డే తెలుగుతో పాటు, హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌ లాంటి స్టార్స్‌తో స్టెప్పులేస్తూ బీటౌన్‌ స్టార్ హీరోయిన్‌గా మారుతోంది. ఇక ఈ బ్యూటీ కూడా ఐటెమ్ సాంగ్ చేసింది. 'రంగస్థలం'లో జిగేలురాణిగా మాస్‌ స్టెప్పులేసింది. ఇక ఈ సాంగ్‌కి పూజా 50 లక్షలు తీసుకుందని చెప్తారు. 'ఆర్.ఎక్స్.100'తో గ్లామర్ బాంబ్స్‌ పేల్చిన పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా ఐటెమ్ సాంగ్స్‌ని క్యాష్ చేసుకుంది. డెబ్యూతోనే బోల్డ్‌ బ్యూటీ అనే ఇమేజ్‌ కూడా వచ్చింది కాబట్టి, స్పెషల్‌ సాంగ్స్‌ ఆఫర్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇక 'సీత' సినిమాలో బుల్లెట్‌ సాంగ్‌కి స్టెప్పులేసిన పాయల్‌ భారీగా చార్జ్ చేసిందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: