ఆ సినిమా పెద్ద హిట్ అవడానికి కైకాల సత్యనారాయణే కారణమా?
ఆ తర్వాత వయసు మీద పడుతున్న కొద్ది విలన్ పాత్రలను పక్కన పెడుతూ ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఆ పాత్రల్లోనూ అద్భుత సంచలనాలు సృష్టించారు కైకాల. వివిధ జోనర్లలో పాత్రలు చేస్తూ మల్టీ టాలెంటెడ్ నటుడిగా కీర్తి ప్రతిష్టలు పొందారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలకు కైకాల సత్యనారాయణ పెట్టింది పేరు. అప్పట్లో యముడి పాత్రలు చేయాలంటే ఎస్ వీ రంగారావు తర్వాత కైకాలనే అని ఫిక్స్ అయ్యేవారు. ఆయన నటించిన "ఘటోత్కచుడు" సినిమా సక్సెస్ భారాన్ని అయన భుజంపై వేసుకుని 100 కి 200 శాతం పర్ఫార్మెన్స్ ఇచ్చి కాసుల వర్షం కురిపించారు.
అలా తన నటనతో ప్రేక్షకులను కైవసం చేసుకున్నారు కైకాల. 2019 లో నందమూరి తారక రామారావు బయోపిక్ "కథానాయకుడు" చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను పోషించారు. మహర్షి సినిమాలోనూ నటించారు. ఇక ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు మరో చిత్రం చేయలేదు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. త్వరలో ఆయన కోలుకుని మనం ముందు సంతోషంగా ఉండాలని కోరుకుందాం.