యాష్ హీరోగా
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన
సినిమా కేజిఎఫ్ చాప్టర్ వన్ ఈ
సినిమా చాలా సైలెంట్ గా పాన్
ఇండియా రేంజ్ లో విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే, అయితే ఈ సినిమాకు కొనసాగింపు గా కే జి ఎఫ్ చాప్టర్ టు తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ ను చిత్ర బృందం బయటకు వదలగా దీనికి పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెంచేసింది. ఈ
సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా
కరోనా పరిస్థితుల ఆలస్యం అవుతూ వస్తోంది, ఇది ఇలా ఉంటే ఈ సినిమాను 14 ఏప్రిల్ 2022 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం తెలియజేసింది.
అయితే తాజాగా మరో భారీ చిత్రం ఈ
సినిమా విడుదల తేదీ రోజే విడుదల కావడానికి సిద్దం అయ్యింది.
అమీర్ ఖాన్ హీరోగా
కరీనా కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో అక్కినేని
నాగచైతన్య ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలు
క్రిస్ మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం తెలియజేశారు. ఆ తర్వాత
ఫిబ్రవరి 14 వ తేదీకి మార్చారు. అయితే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాను 14 ఏప్రిల్ 2022 లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనితో పాన్
ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు తలపడనున్నాయి. మరి ఇలా రెండు భారీ క్రేజ్ ఉన్న సినిమాలు ఒకే రోజు విడుదల కావడం వల్ల ఏదో ఒక
సినిమా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఈ
మూవీ మేకర్స్ చెప్పిన తేదీ లకే ఈ సినిమాలను విడుదల చేస్తారా..? లేక ఎవరైనా తమ
సినిమా విడుదల తేదీలను మార్చుకుంటారా..? తెలియాలంటే మరి కొద్ది కాలం వేచి చూడాల్సిందే.