ప్రభాస్ "రాధేశ్యామ్" రిలీజ్ కు ఇన్ని థియేటర్లా... షాక్ లో సినీ వర్గాలు?
ఇటలీ నేపథ్యంగా సాగేటటువంటి ఈ పీరియాడికల్ ప్రేమ కథలో డార్లింగ్, పూజ హెగ్డే ఎలా కనిపించనున్నారు అన్న ఆసక్తి రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్ ఒకరు ఫ్యాన్స్ ఇంకా ఎంతకాలం మమ్మల్ని వెయిట్ చేయిస్తారు. రిలీజ్ ఎపుడు చేస్తారు అంటూ ఆందోళన వెళ్ళబుచ్చాడు. అంతేనా త్వరగా చెప్పక పోతే నా చావుకు దర్శకుడు కె రాధాకృష్ణ మరియు యువి క్రియేషన్ వారే కారణం అంటూ సూసైడ్ నోట్ కూడా రాశారు. అంతగా అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు పనులను వాయువేగంతో ముందుకు నడిపి మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది టీం. వచ్చే ఏడాది జనవరి 14 న పండుగ కానుకగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
అయితే ఈ మూవీ రిలీజ్ ను భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అది కూడా అంచనాలకు మించి రికార్డు స్థాయిలో రిలీజ్ కు సంసిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని పలు బాషల్లో విడుదల చేసేందుకు దాదాపు అన్ని మెయిన్ థియేటర్స్ ను బుక్ చేస్తున్నట్లు సమాచారం. హిందీలో అయితే ఏకంగా 3,500 స్క్రీన్స్ ను ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ కోసం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రిలీజ్ ఏర్పాట్లు చూస్తుంటే సినీ దిగ్గజాలు సైతం నివ్వెరపోతున్నారట. వామ్మో ఈ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ ఏ హీరోకి జరగలేదుగా అంటూ ఆశ్చర్యపోతున్నారట. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.