స్టార్ హీరో హోదాను సంపాదించుకోవడం అంటే అంత చిన్న విషయమేమీ కాదు. ఎంత సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా టాలెంట్ లేకపోతే మూడు నాలుగు చిత్రాలకే మూట ముళ్ళు సద్దుకోవాల్సిందే. ఇక ఎంతో కష్టపడి తమని తాము మార్చుకుంటూ ప్రేక్షక అభిమానాన్ని పొంది స్టార్ హీరోల స్థాయికి చేరుకుంటారు చాలామంది. వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వారి ప్రతి చిన్న కదలిక వైరల్ గా మారుతుంటుంది. అలాంటిది వారి జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి అనే ఘట్టం అంటే ఫ్యాన్స్ కి ఇంకెంత పెద్ద అంశం అన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలా హీరోల భార్యలు కూడా పెద్ద సెలబ్రిటీలుగా మారుతుంటారు. కొందరైతే హీరోల వైఫ్ లు గానే కాకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ పాపులర్ అవుతుంటారు.
అలాంటి వారిలో ముందుంటారు ఉపాసన కొణిదెల. మెగా ఫ్యామిలీ ఇంటి కోడలిగా అడుగు పెట్టిన ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అపోలో హాస్పిటల్స్ కు వైస్ చైర్‌పర్సన్‌గా ఎప్పుడూ బిజీ బిజీ గా ఉండే ఈమె ఇటు కుటుంబ బాధ్యతలను చక్కగా చూసుకుంటుంది. ఈమెకు జంతువులంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. జంతువుల పరిరక్షణ కొరకు కృషి చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులకు ఎపుడు టచ్ లో ఉంటారు ఉపాసన. ఈమెకు టాలీవుడ్ లో హీరోయిన్ల తోను అదే విధంగా ప్రముఖ వ్యాపారవేత్తలు తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఉపాసనకు ప్రత్యేకంగా టాలీవుడ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది.
అదే విధంగా అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి కూడా, వీరి వివాహం అనంతరం సామాజిక మాద్యమల ద్వారా ఫ్యాన్స్ కి అప్డేట్స్ ఇస్తూ క్రేజ్ పెంచుకున్నారు. ఇదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి కూడా సెలబ్రిటీ. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం అన్నది తెలిసిందే. అయితే పెళ్లి చూపుల్లో అమ్మాయి నాకు బాగా నచ్చిందని తారక్ చెప్పారు కానీ పెళ్లి అయ్యేంత వరకు కూడా లక్ష్మీ ప్రణతి తారక్ తనకు నచ్చారని చెప్పలేదట. పెళ్లి చూపులకు పెళ్లికి మధ్య ఎనిమిది నెలలు గ్యాప్ వచ్చిందని ఇన్ని రోజుల్లో ఎప్పుడూ కూడా తను నచ్చినట్లు ఒక్కసారి కూడా ప్రణతి చెప్పలేదని...మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో మాటల సందర్భంలో సరదాగా తన పెళ్లి నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్.