ఆర్జివికి కాల్ చేస్తే.. అక్కడికి రమ్మంటాడు : అషు రెడ్డి
బిగ్ బాస్ హౌస్ లోకి అరియనా కంటెస్టెంట్ గా వెళ్ళింది. చిన్న చితక ఇంటర్వ్యూలు చేసే అరియనా ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అర్హత సాధించడానికి రాంగోపాల్ వర్మ తో చేసిన ఇంటర్వ్యూ కారణం అని చెప్పాలి. ఈ క్రమంలోనే కృతజ్ఞతగా బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తర్వాత రాంగోపాల్ వర్మతో ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది అరియనా. దీంతో ఈ బోల్డ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా మరో బిగ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డి కూడా ఆర్జీవి తో ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేయడం గమనార్హం.
ఈ ఇంటర్వ్యూ లో ఎన్నో బోల్డ్ ప్రశ్నలు సమాధానాలు కూడా ఉన్నాయి. ఈ రెండు ఇంటర్వ్యూలలో ఇద్దరు భామలు ఎంతగానో ఫేమస్ అయిపోయారు. ఇకపోతే ఇటీవలే అషు రెడ్డి రామ్ గోపాల్ వర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ అనే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది అషు రెడ్డి. ఇదే కార్యక్రమానికి మరో ముద్దుగుమ్మ అరియనా కూడా వచ్చేసింది. ఇద్దరు ఇక్కడే ఉండటం తో ఆర్జివి కి కాల్ చేయాలి అంటూ అడుగుతుంది సుమ. నేను చెయ్యను నువ్వే చెయ్యి ఆయన కి కాల్ చేస్తే కాఫీ కి రమ్మంటాడు అంటూ బూతులు మాట్లాడుతుంది అషు రెడ్డి. దీంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు.