మాస్ చిత్రాల్లో బన్నీ "రేసుగుర్రం" వేరే లెవెల్...

VAMSI
క్లాస్ మరియు మాస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ప్రత్యేకమైన నటనతో అలరించి తన ఫ్యాన్స్ గా చేసుకున్న దీటైన హీరో అల్లు అర్జున్. ఈ ఐకాన్ స్టార్ సినీ కెరీర్ లో పేరుతో పాటు సక్సెస్ ను అందించిన ఆణిముత్యం లాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో "రేసుగుర్రం" కూడా ఒకటి. మాస్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ అంచనాలకు మించిన భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో బన్నీ మాస్ యాక్షన్ తో ఇరగదీశాడు. తన తెలివితేటలతో విలన్ కు ముచ్చమటలు పట్టించారు. ఎండింగ్ లో హీరోకి విలన్ కి మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కితకితలు పెట్టాయి.

ఇక హై క్లాస్ కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్ర పోషించిన శృతి హాసన్ కూడా హీరో పరిచయం తర్వాత ఊర స్టెప్పులు వేయడం బలేగా అనిపించింది. మాస్ మూవీ అయినా కామెడీ టచ్ ని పుష్కలంగా అందించడం ఈ మూవీకి మరింత ప్లస్ అయ్యింది. ఇక బ్రహ్మానందం కామెడీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సినిమా భారాన్ని ఒక రకంగా తన భుజాలపై వేసుకున్నారనే చెప్పాలి. సీరియస్ మాస్ యాక్షన్ ని కామెడీగా చేస్తూ బాగా నవ్వించారు. "సినిమా చూపిస్తా  మావ" సాంగ్ సినిమాలో మరింత జోష్ పెంచింది. ఆడియన్స్ లో మరింత జోరును పెంచి హిట్ అందుకున్న మాస్ పాటల్లో ఇదే ఒకటి.

సమ్మర్ కి విడుదలయిన పక్క మాస్ మసాలా చిత్రంగా బరిలోకి దిగిన రేసుగుర్రం సినిమా రేసులో ఘన విజయంతో పరుగులు తీసిందనే చెప్పాలి. మాస్ మిర్చిగా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే వసూళ్లను రాబట్టింది.  అంతేకాదు ఈ సినిమా బన్నీ కెరియర్ లోనే 100 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసిన తొలి చిత్రంగా గుర్తింపు పొందటం విశేషం. ఈ సినిమాకి మొదట సమంత ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో నెక్స్ట్ ఆప్షన్ గా శృతి హాసన్ కు ఛాన్స్ దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: