దాసరి పై అలా పగ తీర్చుకున్నానంటున్న హీరో ..!
దాసరిపై ఆయనకి చాలా కోపం ఉండేదట. దాసరి నారాయణ తో కలిసి ఒక సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సిన సమయంలో నేను అక్కడికి వెళ్ళలేదు. దాంతో షూటింగ్ అంతా చాలా డిస్టర్బ్ అయినట్లు చక్రవర్తి తెలియజేశాడు. దాంతో ఇక దాసరి నారాయణ గారు చాలా టెన్షన్ పడ్డారట. ఈ విషయం తెలుసుకున్న జె.డి.చక్రవర్తి నాకు చాలా ఆనందం వేసింది అని చెప్పుకొచ్చాడు. అలా చేయడానికి గల కారణం ఏంటో చెబుతానంటూ..
జెడి చక్రవర్తి తండ్రి పేరు రాజా. చక్రవర్తి పుట్టకముందే దాసరి, రాజా ఇద్దరూ మంచి స్నేహితులట. ఈ విషయం మా బంధువులు చెబితే తెలిసిందని తెలియజేశాడు చక్రవర్తి. దాసరి నారాయణ గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పద్మ గారితో తన లవ్ మ్యాటర్ ని చక్రవర్తి తండ్రి ఆమెకు తెలియజేయడంతో.. వారిద్దరి పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చాడు చక్రవర్తి. దాసరిగారు సినీ ఇండస్ట్రీ లోకి రావడానికి మా నాన్న సహాయం చేశారని చెప్పుకొచ్చాడు.
ఇక వీరిద్దరూ వివాహం తర్వాత కూడా కొంత కాలం మా ఇంట్లోనే ఉండేవారట. అలా నెమ్మదిగా దాసరి గారు ఎదుగుతూ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఎదిగాడని చెప్పుకొచ్చాడు చక్రవర్తి. ఒకరోజు మా నాన్న గారి తోటి మేము తన ఇంటికి వెళితే.. తను సిట్టింగ్ లో ఉన్నారని, కాసేపు బయటే ఉండమన్నారు. అలా చాలా సేపు తమ ఇంట్లోనే ఉన్నాము అని చెప్పుకొచ్చారు చక్రవర్తి. కానీ దాసరి గారు మాత్రం బయటికి రాలేదు. సరేలే అని మేడ మీదకు వెళ్లి డోర్ తీయగా.. తన అసిస్టెంట్ అనుకొని రాజా వాళ్లు వెళ్లిపోయారా అని అడిగాడట. దాంతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగా రాజా ఉండడంతో ఇద్దరు ఒక్కసారి షాక్ కు గురయ్యారట.అలా అవమానించిన అతని కోసం, ఇలా పగ తీర్చు కున్ననని చెప్పుకొచ్చాడు.