ఈ మధ్య టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న పాటలివే?

VAMSI
సంగీతం అంటే ఇష్టపడని వారు ఉండరు. కొన్ని పాటలు ఎంత బాగా అలరిస్తాయి అంటే ఏళ్లు గడుస్తున్నా ఆ పాటల్లోని మాధుర్యం మాత్రం ఎప్పుడూ ఫ్రెష్ గానే ఉంటుంది. అలా చెప్పుకుంటూ పోతే సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతి సంవత్సరం టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చిత్రాలు హిట్ అందుకోగా మరికొన్ని నిరాశను మిగిలుస్తుంటాయి. కొన్ని పాటలు మాత్రం సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా గొప్ప ఆదరణ పొందుతుంటాయి. ఇలా ప్రతి ఏడు పలు పాటలు ది బెస్ట్ హిట్ సాంగ్స్ గా గుర్తింపు పొందుతాయి. అలా 2021 లో అత్యధిక ఆదరణ పొందిన పాటలను అలాగే ఆ పాటలను పాడి మనకందించిన గాయనీ గాయకులను తెలుసుకుందాం పదండి.

* చిరంజీవి మరియు రామ్ చరణ్ నటించిన ఆచార్య మూవీ నుండి విడుదలయిన "లాహేలాహే.. లాహే" పాట ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. విడుదలయిన కాసేపటికే ఈ పాట సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోయింది. ఈ పాటను పాడిన వారు హారిక నారాయణ్- సాహితీ చాగంటి. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్న విషయం తెలిసిందే.

* ఇటీవలే విడుదలై ఘన విజయాన్ని అందుకున్న "లవ్ స్టోరీ" చిత్రంలో "దాని కుడి భుజం మీద కడవ..." అంటూ సాగే పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ పాటను సింగర్ మంగ్లి పాడారు. ఇప్పటికీ ఇది యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉంది.

* వకీల్ సాబ్ మూవీ కూడా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలోని "మగువా మగువా..." పాట ఎంత పెద్ద హిట్ అయ్యింది అనేది అందరికీ తెలిసిందే. ఈ పాటను సింగర్ సిద్దు శ్రీరామ్ ఆలపించారు. ఇదే సినిమాలో "కంటి పాప కంటి పాప"  అనే మరో పాట కూడా మంచి ఆదరణ పొందింది. ఈ పాటను  అర్మాన్ మాలిక్ పాడారు.

* ఉప్పెన చిత్రంలోని "జలజలజల పాతం నువ్వు" పాట కూడా సూపర్ హిట్ ను అందుకుంది. ఈ పాటను జస్‌ప్రీత్‌ జాజ్, శ్రేయా ఘోషల్‌ లు పాడారు.

* అర్థ శతాబ్దం మూవీ లో "ఏ కన్నులు చూడని చిత్రమే" ఈ పాటను పాడింది  సిద్ శ్రీరామ్. ఇది కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టగలిగింది.
 
* ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ నుండి  "చుక్కల చున్నికే"  పాట అందరి మన్నలను పొంది హిట్ అందుకుంది. ఈ పాటకు సింగర్ చేతన్ భరద్వాజ్ స్వరాన్ని అందించారు.

ఇలా ఈ మధ్య విడుదలై ప్రేక్షకుల మన్ననను ఈ పాటలు అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: