బాలీవుడ్ లో వాలిపోతున్న మరో తెలుగు స్టోరీ..!
ప్రేమ కథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో సందడి చేసిన నాని, లేటెస్ట్‌గా 'శ్యామ్ సింగరాయ్' అనే పీరియాడికల్ ఫిల్మ్ చేశాడు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దక్షిణాదిన నాలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, మళయాళీ, కన్నడ భాషల్లో విడుదల అవుతోంది.
ఈ మధ్య చాలా తెలుగు సినిమాలు దక్షిణాదితో పాటు, హిందీలోనూ విడుదల అవుతున్నాయి. అయితే 'శ్యామ్ సింగరాయ్' మాత్రం సౌత్‌కే పరిమితమైంది. మరి ఈ మూవీలో హిందీలో ఎందుకు విడుదల కావడం లేదనే ఆసక్తికరమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీని హృతిక్ రోషన్ రీమేక్ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది.
నాని 'శ్యామ్ సింగరాయ్' ప్రమోషన్స్‌లో హిందీ రీమేక్ గురించి హింట్స్ ఇచ్చాడు. 'శ్యామ్ సింగరాయ్' సినిమాకి పాన్ ఇండియన్ అప్పీల్ ఉందని, ఈ కథని హిందీలో హృతిక్ రోషన్ రీమేక్ చేసినా చెయ్యొచ్చని చెప్పాడు. మరి 'జోధాఅక్బర్' లాంటి హిస్టారికల్ మూవీతో ప్రశంసలు అందుకున్న హృతిక్,'శ్యామ్ సింగరాయ్'గా మారతాడా అనేది చూడాలి .
మొత్తానికి మన దర్శక నిర్మాతలు సంబరపడిపోతున్నారు. మన స్టోరీలకు బాలీవుడ్ లో డిమాండ్ పెరుగుతుండటంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి సీన్ లే రిపీట్ అవుతాయని భావిస్తున్నారు. మరింత ఉత్సాహంతో సినిమా కథలను అల్లేందుకు ఆరాటపడుతున్నారు టాలీవుడ్ మేకర్స్. మన సినిమాలు హిందీలోకి రీమేక్ కావడం మనోళ్లలో మరింత జోష్ నింపుతోంది.