మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా అధికారిక లాంచింగ్ ఈ రోజు ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జంటగా తమన్నా హీరోయిన్ గ నటించబోతోంది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్ర లో కీర్తి సురేష్ నటించబోతుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా బోలా శంకర్ సినిమా నుండి మెగాస్టార్ చిరంజీవికి, కీర్తి సురేష్ కు సంబంధించిన ఒక వీడియోను చిత్ర బృందం విడుదల చేయగా దీనికి జనాల నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బోలా శంకర్ సినిమా కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బోలా శంకర్ సినిమాలో చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించడానికి రెండు కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసింది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. కీర్తి సురేష్ కు చెల్లెలు పాత్రలో నటించడం పెద్ద కొత్తేమీ కాదు. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా తెరకెక్కిన పెద్దన్న సినిమాలో కూడా కీర్తి సురేష్ రజినీకాంత్ కు చెల్లెలిగా నటించి మెప్పించింది.
ఇలా కీర్తి సురేష్ కెరియర్ పరంగా కేవలం కమర్షియల్ సినిమాలలో నటిస్తూ అంద చందాలతో అలరించడం మాత్రమే కాకుండా మహానటి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ జనాల్లో తనదైన ముద్ర వేసింది. మహానటి సినిమా తో ఎంతో మంది జనాలను అలరించిన కీర్తి సురేష్ పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది. ఇటు తెలుగుతో పాటు తమిళ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించిన కీర్తి సురేష్ తమిళ నాట కూడా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది.