ఏఆర్ రెహ్మాన్ మరియు మణిశర్మ వంటి దిగ్గజ సంగీత దర్శకులకి గురువుగా వ్యవరించిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి
టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగిన కోటి అసలు పేరు సాలూరి కోటేశ్వరావు అని తెలుస్తుంది.లెజండరీ తెలుగు సంగీత దర్శకుడు చక్రవర్తి దెగ్గర సహాయకుడిగా పనిచేసి రాజ్ అనే మరో సంగీత దర్శకుడితో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకి సంగీతం అందించాడని తెలుస్తుంది.. రాజ్ కోటి కాంబినేషన్ అప్పట్లో టాలీవుడ్ లో ఆ క్రేజ్ వేరేలా ఉండేదని తెలుస్తోంది.కొన్ని కారణాల వల్ల రాజ్ తో విడిపోయి సోలోగా కూడా మ్యూజిక్ చేశాడట కోటి. ఈ క్రమంలో తన కెరీర్ మరియు పర్సనల్ విషయాల గురించి సోషల్ మీడియా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడని తెలుస్తుంది.
తాజాగా కోటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనది ప్రేమ వివాహం కాదని నాకు ప్రేమలో పడేంత సమయం లేదని చెప్పాడని తెలుస్తుంది.స్కూల్ టైంలో ఒక అమ్మాయిని మాత్రమే ప్రేమించానని అదే నా ఫస్ట్ లవ్ అని ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసే దైర్యం రాలేదని చెప్పుకొచ్చాడాట. అందుకే నా భార్యని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న అని ఇక పెళ్లి తరువాత కెరీర్ సక్సెస్ అవుతుందని నేను కూడా అంచెలంచెలుగా ఎదిగానని ఎవరికైనా ఒక టైం అంటూ వస్తుందని అప్పటివరకు కష్టపడుతూ ఓపికగా ఉండాలని తన సక్సెస్ సీక్రెట్ చెప్పాడట కోటి. ఇక తన కెరీర్ లో తొలిసారి బాలయ్య బాబు చిత్రాన్ని కొంటె అది దారుణమైన నష్టాలని తెచ్చిపెట్టిందని చెప్పుకొచ్చాడటా. కోదండరామిరెడ్డి, బాలయ్య కాంబినేషన్ అంటే అప్పట్లో క్రేజ్ ఉండేదని అందుకే వారిద్దరి సినిమాను అప్పట్లోనే 8లక్షలు పెట్టి కొన్నానని నయా పైసా కూడా లాభం రాలేదని చెప్పుకొచ్చాడటా.రెండోరోజుకే సినిమాను ఎత్తేశారని అని ఆవేదన వ్యక్తం చేశాడట కోటి. ఆ దెబ్బకు మళ్ళీ సినిమా ప్రొడక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ వైపు అడుగులెయ్యలేదని సమాచారం.సైడ్ బిజినెస్ అన్ని కూడా నాకు నష్టాలే మిగిల్చాయని చెన్నైలో మాత్రం తనకో స్టూడియో ఉందని అదొక్కటే లాభాల్లో నడుస్తుందని స్పషం చేశాడట కోటి.