ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన కాజల్ అగర్వాల్..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ కాజల్ అగర్వాల్ కళ్యాణ్ రామ్ హీరో గా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఇలా మొదటి సినిమా తోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ సినిమా ఆఫర్ లను కొట్టేసింది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ కొంత కాలం క్రితం తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ పలు సినిమాలలో నటిస్తుంది. ఇలా పెళ్ళి తర్వాత కూడా సినిమాలలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అయింది అంటూ ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.


అయితే ఇలా వైరల్ అవుతున్న ఈ వార్త పై కాజల్ అగర్వాల్ స్పందించింది. తన ప్రెగ్నెన్సీ పై వస్తున్న వార్తలను కాజల్ అగర్వాల్ ఖండించింది. ఇప్పుడు నేను నా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడాలి అని అనుకోవడం లేదు. అయితే దానికి సమయం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాను అని కాజల్ అగర్వాల్ తెలియజేసింది. మాతృత్వం అనేది చాలా గొప్ప విషయం. నాకు సంబంధించినంత వ‌ర‌కు ఓ వైపు ఎగ్జ‌యిట్‌మెంట్‌ ను క‌లిగిస్తూనే నెర్వ‌స్‌ గానూ అనిపిస్తుంది అని కాజల్ అగర్వాల్ తెలియజేసింది. ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమా తో పాటు ఉమ అనే బాలీవుడ్ సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు కాజల్ అగర్వాల్, నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: