అనుబంధాలను కాపాడిన వెంకీ "సంక్రాంతి"

VAMSI
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మూలస్థంబాలైన అగ్ర హీరోలలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చిన కథానాయకుడు. కుటుంబ తరహా చిత్రాలను ఎక్కువగా ఎన్నుకుంటూ వాటిలో వైవిధ్యాన్ని పరిచయం చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తారు ఈ హీరో. వెంకీ హీరోగా ఎన్నో కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కాయి వాటిలో దాదాపు అన్ని ప్రేక్షకాదరణ పొంది సక్సెస్ ను అందుకున్నాయి. అలాంటి అరుదైన చిత్రాలలో ఒకటి సంక్రాంతి. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా చేయగా, స్నేహ, ఆర్తి అగర్వాల్ లు ముఖ్య భూమికలు పోషించారు. శ్రీకాంత్, సంగీత, శివాజీ, శర్వానంద్, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రముఖ పాత్రల్లో నటించి ఆహా అనిపించారు.  

సినిమాను ఒక పండుగ లాగా వెండి తెరపై వెలుగులు పంచవచ్చని ఈ మూవీని మన ముందుకు తీసుకువచ్చాడు దర్శకుడు ముప్పలనేని శివ.  2005 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది. ఉమ్మడి కుటుంబం అంటే ఇలానే ఉండాలి. అందరూ కలిసి జీవిస్తే జీవితం అని అనిపించేలా ఈ స్టోరీని కనబరిచారు డైరెక్టర్. అన్నదమ్ముల అనుబందం. వదినమ్మ సహకారం, తల్లి తండ్రుల ప్రేమానురాగాలు, కామెడీకి కామెడీ, మనసును పరవసింపచేసే సంగీతం ఇలా అన్నిటినీ కలగలిపిన అందమైన చిత్రంగా సంక్రాంతి మూవీ సూపర్ హిట్ ను అందుకుంది.

ఉమ్మడి కుటుంబాల్లోని సంతోషం, విలువలు, అప్యాయతలు గురించి నేటి తరానికి తెలియచేసేలా ఈ చిత్రాన్ని తీయడం హర్షించదగ్గ అంశం. ఎస్ ఎ. రాజ్ కుమార్ అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా వెంకీ కెరియర్ లో ఒక ఆణిముత్యం అనే చెప్పాలి. ఈ సినిమాను ఇప్పుడు చూసినా మనసుకు హత్తుకుపోతుంది. ఈ సినిమా ద్వారా ఎన్నో కుటుంబాలు విడిపోకుండా కలిసి ఉండి ఉంటారు. అంతటి పవర్ ఉంది ఈ సినిమాలో ఇంకా మరెన్నో ఇలాంటి సినిమాలు మనుషుల బంధాలను కలుపుకోయేలా రావాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: