బిగ్ బాస్ 5 : విశ్వ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
అయితే ఇక ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ విన్నర్ గా ఎవరు నిలువబోతున్నారో అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రతి ఒక్కరు ఎంతోగట్టి పోటీ ఇస్తున్నారు. అయితే ఇప్పటివరకు 9 వాటల్లో వారాల్లో 8మంది కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక 9వ వారం ముగింపులో ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న విశ్వ బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోవడం మాత్రం అందరినీ షాక్ కి గురిచేసింది. కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాదు హౌస్ లో ఉన్నకంటెస్టెంట్స్ సైతం విశ్వ ఎలిమినేషన్ తో అవాక్కయ్యారు.
ఇప్పటివరకు ఎలాంటి కాంట్రవర్సీ లకు పోకుండా హౌస్ లో అందరి కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న విశ్వ ఎలిమినేట్ అవ్వడాన్ని నమ్మలేక పోయారు. అయితే ఇక విశ్వ ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళిన విశ్వ ఏమైనా లాభ పడ్డాడా.. విశ్వ కి అసలు రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు అనే దానిపై మాత్రం అందరూ వెతకడం ప్రారంభించారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం విశ్వ కి వారానికి రెండున్నర లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఇక ఈ లెక్కన చూసుకుంటే తొమ్మిది వారాల వరకు బిగ్ బాస్ లో కొనసాగిన విశ్వ 22 లక్షల వరకూ రెమ్యూనరేషన్ పొందినట్లు తెలుస్తోంది.