బాలయ్య సినిమాలో కన్నడ స్టార్ విజయ్?
కాగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన సూపర్ హిట్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీనుతో కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి వస్తున్న అఖండ సినిమాపై కూడా ఒక రేంజిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలవుతున్న అప్డేట్స్ ప్రేక్షకులు అందరినీ కూడా ఉర్రూతలూగిస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమాతో బిజీగా ఉన్నాడు బాలకృష్ణ.. ఇక ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ను కూడా తీసుకోవాలని డైరెక్టర్ గోపీచంద్ అనుకుంటున్నాడట. దీని కోసం సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లో ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా ఇక ఈ సినిమా తర్వాత అటు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు బాలయ్య.. సినిమా అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కబోతుందట.