ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన చూసి పొగడ్తలతో ముంచేసిన రజనీకాంత్..!

murali krishna
దివంగత విశ్వవిఖ్యాత నటుడు అయిన ఎన్టీఆర్ పోలికనే కాదు వారసత్వాన్ని కూడా అందిపుచ్చుకున్నాడని తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్. తెలుగు సినిమా రంగంలో తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నాడని తెలుస్తుంది.

ఎన్టీఆర్ ఐదు వరుస హిట్లతో కెరీర్‌లోనే ఫుల్ ఊపు మీద ఉన్నాడని ఎన్టీఆర్ సినిమాలకు ఇప్పుడు కేవలం టాలీవుడ్‌లోనే కాదట టోటల్ సౌత్ లో అన్ని ఇండస్ట్రీల్లోనూ క్రేజ్ ఉందని తెలుస్తుంది.. ఎన్టీఆర్ నటన అన్నా మరియు డ్యాన్స్ అన్నా కూడా తెలుగు సినిమా హీరోలతో పాటు కోలీవుడ్‌ మరియు శాండల్ వుడ్‌, మల్లూవుడ్‌ అలాగే బాలీవుడ్ హీరోలు కూడా ఇష్టపడుతూ ఉంటారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఎన్టీఆర్ సినిమాలకు అభిమానని ఎన్టీఆర్ నటించిన సినిమాలు రజనీ అప్పుడుప్పుడూ చూస్తూ ఉంటారని తెలుస్తుంది.ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని అందరికి తెలుసు.. ఈ సినిమా చూసిన రజనీ కాంత్ ఎన్టీఆర్ నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారని సమాచారం.ఈ సినిమా చూశాక తనకు మొదటి సారి కొడుకులు లేనందుకు బాధపడుతున్నానని కామెంట్ చేశాడని తెలుస్తోంది.

ఈ సినిమా చూశాక తనకూ ఓ కొడుకు ఉంటే బాగుండేది కదా అన్న భావన కలిగిందని రజనీ చెప్పాడని సమాచారం.ఇక రజనీకి ఎన్టీఆర్ ఫ్యామిలీతో ముందు నుంచే ఎంతో అనుబంధం ఉందట . హరికృష్ణ - రజనీకాంత్ ఎంతో సన్నిహితంగా ఉండేవారని తెలుస్తుంది.హరికృష్ణ చనిపోయినప్పుడు తాను జపాన్‌లో ఉండడం వల్లే రాలేకపోయానని రజనీ చెప్పారని సమాచారం.ఇక రజనీ తాజాగా నటించిన పెద్దన్న సినిమా ఈ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని తెలుస్తుంది.ఇక ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని అందరికి తెలిసిన విషయమే.ఇప్పటికే విడుదలయిన ఆర్. ఆర్. ఆర్. గ్లింప్స్ అందరిలో అంచనాలు పెంచేసిందని తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: