ఒక్కసారిగా రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన సమంత..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ సమంత నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే తన అందంతో, అభినయంతో, నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో క్రేజీ సినిమా ఆఫర్లను కొట్టేసింది. అందులో భాగంగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన సమంత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థానానికి చేరుకుంది. ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న సమంత ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య ను పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య, సమంత గత కొద్ది కాలం క్రితమే విడిపోయారు. ఇలా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కూడా సమంత సినిమాల పరంగా మాత్రం తన స్పీడు ఏ మాత్రం తగ్గించలేదు. ఇప్పటికే శాకుంతలం సినిమాలో నటిస్తున్న సమంత ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.


ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత తమిళ్ లో విజయ్‌ సేతుపతితో  ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది. దీనితో పాటు సమంత డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30 వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. ది ఫ్యామిలీ మాన్ సీజన్ టు వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సమంత అక్కడ కూడా మంచి ఆఫర్లను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉన్న సమంత మరొక సారి రెమ్యునిరేషన్ విషయంగా వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం సమంత తన తదుపరి చిత్రాల కోసం మూడు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మామూలుగా అయితే సమంతా ఒక్కో సినిమాకు మూడు కోట్ల కంటే తక్కువ రెమ్యూనరేషనే తీసుకున్నదట, కానీ ప్రస్తుతం మాత్రం సమంత జీఎస్టీ కాకుండా రూ.3 కోట్లు ఇవ్వాలని కండీషన్‌ పెట్టిందట. కానీ సమంత కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు ఏ మాత్రం వెనుకాడడం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: