బాలయ్య సీక్రెట్ బయటపెట్టిన మోహన్ బాబు..??

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు ఒకవైపు భారీ సినిమాలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర రియాలిటీ షోలు, టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇప్పటికే బుల్లితెరపై నాగార్జున, ఎన్టీఆర్ పలు షోలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. వారికీ రియాలిటీ షోల నిర్వాహకులు భారీ రెమ్యునరేషన్ ను ఇవ్వడం వలన స్టార్ హీరోలు రియాలిటీ షోలపై ఆసక్తి చూపడానికి ఇది ఒక్క ప్రధాన కారణం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆహా ఓటీటీలో సమంత, రానా, మంచు లక్ష్మీ పలు షోలను నిర్వహించిన సంగతి అందరికి తెల్సిందే. దీపావళి కానుకగా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే పేరుతో రియాలిటీ షో ప్రారంభమైన సంగతి అందరికి తెల్సిందే.
ఈ షో మొదటి ఎపిసోడ్ లోనే నందమూరి బాలకృష్ణ అదరగొట్టారని మంచి టాక్ వినిపిస్తుంది. అంతేకాదు.. ఈ షోకి మొదటి గెస్ట్ గా మోహన్ బాబు హాజరైయ్యారు. బాలయ్య ఈ షోలో మోహన్ బాబు సీక్రెట్లను బయటపెట్టగా అదే సమయంలో మోహన్ బాబు సైతం బాలకృష్ణ సీక్రెట్లను వెలికితీశాడు. ఇండస్ట్రీలో అటు బాలయ్య, ఇటు మోహన్ బాబు ఇద్దరూ ముక్కుసూటితనానికి మారుపేరుగా నిలిచారు. అయితే మోహన్ బాబు ఇల్లు ఎయిర్ పోర్ట్ కు దగ్గరగా ఉందని నా కారు ముందు వెళుతున్న కారులో ఇద్దరు కనిపించారని అన్నాడు. ఇక డ్రైవర్ ను కారును క్రాస్ చేయాలని చెప్పగా ముందు ఉన్న కారులో నువ్వు ఒక అమ్మాయితో కనిపించావని బాలకృష్ణతో చెప్పుకొచ్చాడు మోహన్ బాబు.
అయితే ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు..? ఏంటి ఆ కథ? అని మోహన్ బాబు ప్రశ్నించాడు. దానికి బాలయ్య స్పందిస్తూ ఆ అమ్మాయి తన ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి మాత్రం కాదని చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య తాను ఎమ్మెల్యేనని అందువల్ల ఆ అమ్మాయికి తాను లిఫ్ట్ ఇచ్చి ఉండవచ్చు కదా అని సరదాగా కామెంట్స్ చేశారు. బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: