దూకుడు సినిమాలో.. మహేష్ ఆ సీన్ అడిగి మరీ పెట్టించుకున్నారట?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ లో నెంబర్ వన్ హీరో గా తెలుగు ప్రేక్షకుల సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు మహేష్ బాబు. గత కొంత కాలం నుంచి వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మహేష్ బాబు. ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను సాధించారు. ఇక ఇలాంటి సినిమాలలో శ్రీను వైట్ల మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన దూకుడు సినిమా కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. మహేష్ బాబు లో కొత్త మాస్ ఎలిమెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేసి శ్రీనువైట్ల దూకుడు సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అటు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ ను అయితే ఇప్పటికీ ప్రేక్షకులు మరచిపోలేరు. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తుంది అంటే చాలు ఇక టీవీలకు అతుక్కుపోయి మరి ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షిస్తూ ఉంటారు. అంతలా సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ప్రభావితం చేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్ గా నటించింది. అయితే ఇటీవలే ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చిన దూకుడు డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ సినిమాలో ఒక సన్నివేశం గురించి ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు.


 సాధారణంగా శ్రీనువైట్ల సినిమాల్లో మందు తాగే సీన్ తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి సీన్ లేకుండా ఆటో శ్రీను వైట్ల సినిమాల్లో దాదాపు గా లేవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ దూకుడు సినిమాలో మాత్రం అలాంటి సీన్ పెట్టకూడదు అని అనుకున్నాడట దర్శకుడు శ్రీనువైట్ల. ఆ సమయంలో మీ సినిమాల్లో మందు తాగే సీన్ బాగా ఫేమస్ అంటకదా.. ఈ సినిమాలో కూడా అలాంటి ఒక సీన్ పెట్టండి అని అడిగాడట మహేష్ బాబు. ఈ సినిమాలో మీ పాత్రకు  అలాంటి సీన్లు ఉండకూడదు అని చెప్పినా కూడా... పట్టుబట్టి మరీ అలాంటి సీన్ పెట్టాలి అని అన్నాడట మహేష్ బాబు. దీంతో మందు తాగే సీన్ కాకుండా మందు వాసన పీల్చి కిక్కే సీన్  పెట్టాడట శ్రీను వైట్ల. ఇక ఈ విషయాన్ని ఇటీవలే ఆలీతో సరదాగా కార్యక్రమంలో చెప్పుకొచ్చారు దర్శకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: