స్టార్ హీరో సినిమా రిలీజ్.. అభిమాని బంపర్ ఆఫర్?
అయితే తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే భారీగా టికెట్లు కొనుగోలు చేసి ఇక మిగతా ఫ్యాన్స్ అందరికీ కూడా తక్కువ ధరకే టిక్కెట్లు ఇవ్వడం లేదా ఉచితంగా టిక్కెట్లు ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఓ అభిమాని తనకు హీరో పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకోవడానికి ప్రయత్నించాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కి భారత దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళ అభిమానులు అయితే రజనీకాంత్ పై మరింత ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ ఉంటారు. గతంలో రజనీకాంత్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకొని రజనీకాంత్ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది.
ఇక ఇప్పుడు ఇలా సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఉన్న అభిమానాన్ని ఓ ఫ్యాన్ వినూత్నంగా చాటుకున్నాడు. తమిళనాడులోని తిరుచ్చి లో హోటల్ యజమాని కర్ణన్ అనే వ్యక్తి సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాని అయితే ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన అన్నాతయి సినిమా విడుదల సందర్భంగా ఏకంగా బంపర్ ఆఫర్ ప్రకటించాడు ఒక రూపాయికే దోష అందిస్తున్నాడు. రజనీకాంత్ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ఆఫర్ ప్రకటించినట్లు సదరు అభిమాని చెప్పుకొచ్చాడు. థియేటర్లకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలి రావాలి అంటూ కోరాడు.