మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసింది, రవితేజ ఈ సంవత్సరం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన క్రాక్ సినిమాతో బాక్సాఫీసు దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఈ సినిమాకు ముందు మాస్ మహారాజా రవితేజ బాక్స్ ఆఫీసు వద్ద వరుస పరాజయాలతో డీలా పడిపోయి ఉన్నాడు. అలాంటి సమయంలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన క్రాక్ సినిమాతో మాస్ మహారాజా రవితేజ మరోసారి అదిరిపోయే బ్లాక్ బస్టర్ ను బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.
ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రవితేజ ఆ జోష్ లోనే వరుస క్రేజీ సినిమాలను ఓకే చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్రబృందం బయటకు వదలగా జనాల నుంచి వీటికి మంచి స్పందన లభించడం మాత్రమే కాకుండా, ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి. ఈ సినిమాతో పాటు రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ ఫుల్ ఎమ్మార్వో పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న రవి తేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమాలో కూడా నటించబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే ప్రకటించాడు. ఇలా మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమా లో నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ మధ్యనే బయటకు వచ్చింది. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇలా మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమా విజయంతో వరుస సినిమాలలో నటిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.