అరవింద్ రిక్వెస్ట్ కు చిరంజీవి మౌనం !

frame అరవింద్ రిక్వెస్ట్ కు చిరంజీవి మౌనం !

Seetha Sailaja
దీపావళి నుండి ఆహా లో ప్రారంభం కాబోతున్న ‘అన్ ష్టాపబుల్’ టాక్ షోపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఓటీటీ కార్యక్రమాలకు టివి షోలకు దూరంగా ఉన్న బాలకృష్ణ ఇప్పుడు మొట్టమొదటిసారి ఈ టాక్ షోను ఎలా నిర్వహిస్తారు అన్న ఆతృత అందరిలోను ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులలో చాల ఎక్కువగా ఉంది.

 
 ఇలాంటి పరిస్థితులలో ఈషో ప్రారంభం రోజున బాలయ్య మొట్టమొదట ఇంటర్వ్యూ చేయబోయే సెలెబ్రెటీ ఎవరు అన్న విషయమై అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఆహా నిర్వాహకులు అల్లు అరవింద్ ఈ టాక్ షోకి సంబంధించిన మొట్టమొదటి ఎపిసోడ్ లో బాలకృష్ణ చేత చిరంజీవి ఇంటర్వ్యూ చేయిద్దామని భావించారట.

 
 అయితే చిరంజీవి అరవింద్ సూచనలను సున్నితంగా తిరస్కరించి ఈమధ్యనే తన చేతికి ఆపరేషన్ అయింది కాబట్టి మరొకసారి ఈ షోకు వస్తాను అని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనితో చిరంజీవి బాలకృష్ణ షోకు రాకపోవడానికి గల కారణాలు వేరే ఉన్నాయా అంటూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈమధ్యనే జరిగిన మా సంస్థ ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ప్యానల్ ను చిరంజీవి పరోక్షంగా సపోర్ట్ చేస్తే ముంచు విష్ణు ప్యానల్ ను బాలకృష్ణ పరోక్షంగా సపోర్ట్ చేసిన విషయం ఓపెన్ సీక్రెట్.

 

 ఈ విషయాలను ఇంకా మనసులో పెట్టుకుని బాలయ్య షోకు చిరంజీవి అంగీకరించలేదా అన్న సందేహాలు ఇండస్ట్రీలో కొందరు వ్యక్తపరుస్తున్నారు. దీనితో దీపావళి రోజు ప్రసారం కాబోయే ఈ షో మొదటి ఎపిసోడ్ లో బాలయ్య మోహన్ బాబు మంచు విష్ణు మంచు లక్ష్మి లను కలిపి ఒకేసారి తన రీతిలో ఇంటర్వ్యూ చేయడంతో ఆ కార్యక్రమం ఈ షోలో ప్రసారం అవుతుందని అంటున్నారు. అయితే ఈ షోకి సంబంధించిన మొదటి ఎపిసోడ్ లో చిరంజీవి బాలయ్యల ఇంటర్వ్యూ ఉండి ఉంటే ఈ షోకు భారీ రేటింగ్స్ వచ్చి ఉండేవని విశ్లేషకుల అభిప్రాయం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: