రవితేజ సినిమా కి వెరైటీ టైటిల్!!
ఇక ఈ సినిమా తర్వాత శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా రవితేజ 68 వ సినిమా గా తెరకెక్కుతుంది. ఈ సినిమా ను వచ్చే ఏడాది వేసవి కి విడుదల చేయాలనీ భావిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత అయన త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే చిత్రాన్ని చేయనున్నాడు. ఎప్పటినుంచో ఈ సినిమా ఉంటుందో లేదో అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా అధికారిక ప్రకటన చేయడం అందరిలో అనుమానాలను క్లియర్ చేసింది.
ఇకపోతే అయన సుధీర్ వర్మ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవలే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. సోషల్ మీడియా లో ఈ వార్తలు రాగ చిత్ర దర్శకుడు దీన్ని అధికారికంగా చెప్పాడు. వెరైటీ కథ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది అయితే తాజగా ఈ సినిమా కి రవాణాసుడు అనే టైటిల్ ని పెట్టడం ఇప్పుడు అందరిలో ఎంతో ఆసక్తి ని ఏర్పరుస్తుంది. మరి ఈ చిత్రానికి ఈ టైటిల్ ఖాయమా అన్నది ఇంకా ప్రకటన రాలేదు రవితేజ అభిమానులు మాత్రం ఈ సినిమా కి టైటిల్ అదిరిపోయిందని అంటున్నారు.