బ్యాడ్ హ్యాబిట్స్ కు బైబై.. న్యూ లైఫ్ కు వెల్ కమ్ చెప్పిన నటులు వీళ్లే..!
పూజా భట్ కూడా తన తప్పుని తెలుసుకుంది. తన జీవితంలో పెద్ద పొరపాటు చేశానని భావిస్తోంది. భయాల నుంచి దూరం కావడానికి పూజ మందుకి దగ్గరైందని తెలుస్తోంది. దీంతో చాలా సమస్యలను ఎదుర్కొందట. అయితే తండ్రి మహేశ్ భట్ మాటలతో ఈ వ్యసనం నుంచి ఎట్టకేలకు బయటపడింది. 2017 నుంచి మళ్లీ మందు ముట్టుకోలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది పూజా భట్. మనీషా కోయిరాల అయితే ఆటోబయోగ్రఫీ 'హీల్డ్- హౌ కేన్సర్ గేవ్ మి ఏ న్యూ లైఫ్'లో మందుకి బానిసవ్వద్దని పేజీల కొద్ది స్టేట్ మెంట్స్ రాసింది. మందు నుంచి బయటపడ్డాక కొత్త లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.
రణ్‌బీర్ కపూర్‌కి అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. రణ్‌బీర్ కాలేజ్‌డేస్‌లో డ్రగ్స్ తీసుకున్నానని చెప్పాడు. తర్వాత హెల్త్‌కి మంచిదికాదని డ్రగ్స్ మానేశానని చెప్పాడు. అయితే డ్రగ్స్‌కి దూరమైనా సిగరెట్‌ని విడిచిపెట్టలేకపోతున్నానని బాధ పడుతున్నాడు రణ్‌బీర్. హీరో సంజయ్ దత్ డ్రగ్స్, ఆల్కహాల్ ను బాగా తీసుకునేవాడు. 'సంజు' సినిమాలో చూపించినట్టు డ్రగ్స్‌కి బానిసయ్యాడు. అయితే ఆ తర్వాత తండ్రి సునీల్ దత్ సాయంతో అమెరికన్ రిహాబిలేషన్ సెంటర్‌లో జాయిన్ అయ్యాడు. డ్రగ్స్ నుంచి బయటపడి మళ్లీ కెరీర్ స్టార్ట్ చేశాడు. షోలో' సినిమా సమయంలో అమితాబ్ బచ్చన్‌కి ఎంత పేరు వచ్చిందో, ధర్మేంద్రకి అంతకంటే ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇలాంటి హీరో బిగ్‌బీ రేంజ్‌లో నిలబడలేకపోవడానికి ఆల్కాహాల్ ఓ కారణమని చెబుతారు. ధర్మేంద్ర కూడా 'యమ్లా పగ్లా దీవానా' రిలీజ్ సమయంలో మందు వల్ల తన భవిష్యత్ నాశనమైపోయిందని బాధపడ్డాడు. అయితే 15 ఏళ్లు వెంటాడిన ఈ అడిక్షన్ నుంచి బయటపడేందుకు కథలు రాయడం మొదలుపెట్టానని, మెల్లగా మందుకు దూరమయ్యానని చెప్పాడు ధర్మేంద్ర.