తండ్రి సినిమాలో ఎంట్రీ ఇచ్చి.. బుల్లి సూపర్ స్టార్ గా మారిపోయాడు?
అంతేకాదు సినిమా మూవీ మొత్తం గౌతమ్ నటించిన పాత్ర సాగి పోతూ ఉండటం గమనార్హం. అంతేకాదు ఇక మహేష్ బాబు కొడుకు నటించిన పాత్ర ఈ సినిమాను మలుపు తిప్పుతుంది అని చెప్పాలి. సాధారణంగా మహేష్ బాబు సినిమాల్లో నటించడం ప్రేక్షకులకి కొత్తేమీ కాదు.. కానీ మహేష్ బాబు తనయుడు.. తెలుగు చిత్ర పరిశ్రమ బుల్లి సూపర్ స్టార్.. గౌతమ్ సినిమాల్లో నటించడం.. అది కూడా మొదటి సారి ఏకంగా తండ్రి సినిమాలో నటించడం ప్రేక్షకులకు ఎంతో ప్రత్యేకం గా మారిపోయింది అని చెప్పాలి. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడంతో అటు ఇది చూసిన అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోయారు.
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఘట్టమనేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాదు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా గుర్తుండిపోయే విధంగా తన నటనతో ముద్ర వేశాడు సూపర్ స్టార్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని. ఇలా చిత్ర పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినా స్టార్ హీరో వారసుడిగా కూడా రికార్డు సృష్టించాడు. గౌతమ్ వన్ నేనొక్కడినే సినిమాలో నటించిన పాత్ర గురించి అయితే ఇప్పటికీ అభిమానులు మర్చిపోవడం లేదు అని చెప్పాలి.