"క్రేజీ అంకుల్స్" పై అంత దుమారం ఎందుకు చెలరేగింది..?

NAGARJUNA NAKKA
బుల్లితెర యాంకర్ శ్రీముఖి తొలిసారిగా వెండితెర ప్రవేశం చేసింది. అయితే ఆ చిత్రం పేరు క్రేజీ అంకుల్స్. ఈ సినిమా పలు వివాదాలకు కారణమైంది. ఈ చిత్రాన్ని థియేటర్లలోకి రాకుండా అడ్డుకునేందుకు మహిళా సంఘాలు రభస సృష్టించాయి. సినిమా ట్రైలర్ విడుదల కాగానే భగ్గుమన్నాయి. మహిళలను కించపరిచేవిధంగా డైలాగ్ లు ఉన్నాయని మండిపడ్డాయి. వాటిని తొలగించాలని తెలంగాణ మహిళా ఐక్య వేదిక డిమాండ్ చేసింది.

క్రేజీ అంకుల్స్ భారతీయ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేలా ఉందని ఆరోపించాయి మహిళా సంఘాలు. స్త్రీల పేరుతో హాస్యం చిత్రీకరించడం చాలా దారుణమైన విషయమనే వ్యాఖ్యలు చేశాయి. సమాజాన్ని రాంగ్ రూట్ పట్టించే విధంగా.. మానవ సంబంధాలు తెంచే విధంగా.. అన్యోన్యంగా ఉండే భార్యా భర్తల మధ్య చిచ్చుపెట్టే విధంగా సినిమా తీరు ఉందని గొడవ చేశాయి. ఇలాంటి అభ్యంతరకర సినిమాలను తెరకెక్కకుండా చూడాలని డిమాండ్ చేశాయి. క్రేజీ అంకుల్స్ సినిమాలోని అభ్యంతరకర సంభాషణలను తొలగించాలని భీష్మించుకు కూర్చున్నాయి. అంతేకాదు వివాదాస్పద సినిమాలు తీసే వారికి ఈ సమాజంలో ఉండే హక్కు లేదన్నాయి.

యాంకర్ శ్రీముఖి మెయిన్ క్యారెక్టర్ లో తెరకెక్కిన ఈ చిత్రం సత్తిబాబు దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాలో సింగర్ మనో, పోసాని కృష్ణ మురళి, భరణి రాజారవీంద్ర నటించారు. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కాగా.. కొద్ది రోజుల ముందు ఈ గొడవ జరిగింది. ఈ సినిమా శ్రీవాస్ 2 బ్యానర్ పై రూపొందింది. మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన క్రేజీ అంకుల్స్ ట్రైలర్ లో ఏముందంటే.. నడి వయసులో ఉండే రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్.. ఒక యువతిపై మనసు పారేసుకునే స్టోరీ ఇది. హైదరాబాద్ లో ఉండే ఆర్.ఆర్.ఆర్. అంటే రాజు, రెడ్డి, రావు స్టోరీ. వీళ్లదొక వ్యధ అని శ్రీనివాస్ రెడ్డి డైలాగ్ చెప్పడంతో ట్రైలర్ స్టార్ట్ అయిపోతుంది. ‘‘మా వైఫ్‌లు తాజ్ మహల్ ఒక్కటే.. చూడటానికి తప్ప ఎక్కటానికి పనికిరావు’’ అని డబుల్ మీనింగ్ డైలాగు ట్రైలర్ లో ఉండటంతో మహిళలు కన్నెర్ర జేశారు.  

భార్యల దగ్గర శారీరక సుఖం దొరక్క.. అందుకోసం తెగ వెతికేస్తుంటారు ఈ అంకుల్స్. ఇలాంటి వాళ్లకు శ్రీముఖి కనిపించడంతో ఆమెపై మనసు పారేసుకుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని అంకుల్స్ ను ఎలా ఆటపట్టిస్తుంది అనేది ఈ చిత్రంలోని ప్రధాన సారాంశం. ఆ అంకుల్స్ కి ఎలా బుద్ది వస్తుందని అనేది కూడా ఈ సినిమాలో చూపిస్తారు. మాంచి కామెడి సినిమాగా ప్రేక్షకులను మెప్పిస్తుందని సినిమా యూనిట్ అనుకుంటే.. కాంట్రవర్సీలతో సాగింది.












మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: