పునీత్ కొత్త సినిమా కోసం శివ రాజ్ కుమార్..?

Anilkumar
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన అకాల మరణం యావత్ ప్రపంచానికే పెద్ద షాక్ ఇచ్చింది. ఒక సినీ నటుడిగానే కాకుండా నిజ జీవితంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరో అనిపించుకున్న పునీత్ రాజ్ కుమార్ ఇక లేరనే విషయాన్ని యావత్ సినీ అభిమానులు తట్టుకోలేక గుండె పగిలేలా రోదిస్తున్నారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా చాలా మంది సినీ ప్రముఖులు పునీత్ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రానా దగ్గుబాటి, వెంకటేష్, శ్రీకాంత్, అలీ తదితరులు బెంగళూరు చేరుకుని..


 కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్ కుమార్ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలియజేశారు. ఇక మరోవైపు పునీత్ రాజ్కుమార్ అకాల మరణంతో ఆయన నటిస్తున్న సినిమాల పరిస్థితి ఏంటనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పునీత్ నటించగా దాదాపు పూర్తికావచ్చిన 'జేమ్స్' సినిమాకు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మన టాలీవుడ్ సినీ హీరో శ్రీకాంత్ కూడా ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నారు.


 చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయింది. అంతేకాదు దీపావళి కానుకగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్. ఇక షూటింగ్ అయితే పూర్తయింది కానీ.. డబ్బింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే తమ్ముడు సినిమా కోసం అన్న శివ రాజ్ కుమార్ రంగంలోకి దిగుతున్నారు. ఈ సినిమాలో పునీత్ క్యారెక్టర్ కి అన్న శివరాజ్ వాయిస్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటుగా మరి కొన్ని సినిమాల కు పునీత్ రాజ్కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ అంతలోనే ఆయన అకాల మరణం చెందారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: