ఆడపిల్లల తల్లి తండ్రులకు ధైర్యాన్ని నింపుతున్న సమంత !

Seetha Sailaja
నాగచైతన్య తో సమంత విడిపోయిన తరువాత గోడకు కొట్టిన బంతిలా ఆమె వేగాన్ని మరింత పెంచింది. వరసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్న సమంత ఈమధ్య అనేక యాత్రా ప్రదేశాలకు వెళ్ళి తన మనసును కుదుట పరుచుకుంది. మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సమంత అవకాశం చిక్కినప్పుడల్లా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేస్తోంది.


ఈ నేపధ్యంలో సమంత ఆడపిల్లల తల్లితండ్రులకు సందేశం ఇస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ‘మీ కూతురు పెళ్లి గురించి ఖంగారు పడకండి. ఆమెను సమర్థవంతంగా తీర్చిదిద్దండి. ఆమె పెళ్లి కోసం డబ్బులు కూడబెట్టే బదులు ఆమె చదువుకు ఆడబ్బును ఖర్చు చేయండి. ఆమెను పెళ్లికి సిద్దం చేయడానికి బదులు మీ అమ్మాయిని తన జీవితంలో ఎదురయ్యే సమస్యలతో యుద్ధం చేయడానికి ధైర్యాన్ని నింపండి. జీవితంలో విజయం సాధించాలి అంటే ఆత్మ విశ్వాసం ఎంత అవసరమో ఆమెకు తెలియచేయండి. అంతేకాదు ఆమెకు ఇతరులకు సహాయం చేసే దయాగుణాన్ని అలవాటు చేయండి. ఎప్పుడూ పెళ్ళి చేసి పంపాలి అన్న ఆలోచనలు కాకుండా ఆ అమ్మాయిని సమర్దురాలుగా తీర్చి దిద్దాలి అన్న ఆలోచనలతో మీ అమ్మాయిని పెంచండి’ అంటూ ఒక ఆలోచనాత్మకమైన పోస్ట్ ఆమె పెట్టింది.


వాస్తవానికి సమంత చెప్పిన ఈవిషయాలు అన్నీ ఆలోచనాత్మకంగా ఉన్నప్పటికీ మధ్య తరగతి దిగువ మధ్యతరగతి ఆడ పిల్లల తల్లితండ్రు లకు సమంత చెపుతున్న మాటలు ఎంతవరకు స్పూర్తిని ఇస్తాయి అన్నది సందేహం, సమంత పెట్టిన ఈ పోస్ట్ పై కొందరు ప్రశంసలు కురిపిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సమంత నటిగా కాకుండా ఉపన్యాసకురాలుగా మారడానికి ప్రయత్నిస్తోందా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ఇది ఇలా ఉండగా సమంత తిరిగి మళ్ళీ సినిమాలలో నటించడానికి ఆశక్తి కనపరుస్తున్నప్పటికీ క్రితంలా టాప్ యంగ్ హీరోల సినిమాలలో ఆమెకు అవకాశాలు రాకపోవచ్చు అన్న కామెంట్స్ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: