డబుల్ రోల్ లో తేడా కొట్టింది.. ఇక నా వల్ల కాదు అంటున్న నాని?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు ఎక్కువగా కమర్షియల్ సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తు ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ కొన్నిసార్లు మాత్రం విభిన్నమైన కథలు తమ దగ్గరికి వచ్చినప్పుడు ప్రయోగాలు చేసేందుకు కూడా సిద్ధమవుతు ఉంటారు. ఇలా స్టార్ హీరోలు చేసే ప్రయోగాలలో ద్విపాత్రాభినయం కూడా ఒకటి అని చెప్పాలి. ద్వి పాత్రాభినయం అంటే అటు ప్రతి హీరోకు కూడా సవాల్ లాంటిదే. ఎందుకంటే ఒకే సినిమాలో రెండు రకాల పాత్రల్లో ఒదిగిపోయి నటించాల్సి ఉంటుంది. అంతేకాదు పాత్రకి ప్రాణం పోసి నటించినప్పుడే సినిమా  ప్రేక్షకులకి కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది.



 ఇక ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలలో ఏమాత్రం తేడా కొట్టిన చివరికి మొదటికే మోసం వస్తుంది. ఇలా ద్విపాత్రాభినయం చేసిన ఎంతో మంది హీరోలు సూపర్ డూపర్ హిట్ కొట్టిన వారు కూడా ఉన్నారు. అదే సమయంలో కొన్ని కొన్ని సార్లు ప్రయత్నాలు ఫలించక  ఫ్లాప్ తో సరిపెట్టుకున్న హీరోలు కూడా ఉన్నారు.  ఇలా నాచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం ప్రయత్నించి ఏకంగా బొక్క బోర్లా పడిపోయాడు. నాచురల్ స్టార్ నాని అప్పటికే జెంటిల్మెన్ అనే సినిమాలో ద్విపాత్రాభినయం తో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని హిట్ కొట్టింది.



 ఇక ఆ తర్వాత మళ్ళీ ద్విపాత్రాభినయం జోలికి వెళ్లలేదు నాని. కానీ ఆ తర్వాత మాత్రం కృష్ణార్జున యుద్ధం అనే ఈ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు సినిమాలో నటన కోసం ఎంతగానో కష్టపడ్డాడు  ఒక పాత్ర కోసం ప్రత్యేకంగా యాస కూడా నేర్చుకున్నాడు. కాని ఈ సినిమా అటు నానికి నిరాశే మిగిల్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా చివరికి ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఇక అప్పటి నుంచి  నాని ద్వి పాత్రాభినయం కి సంబంధించిన సినిమాలు చేయడానికి కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ద్విపాత్రాభినయం చేసి రిస్కు చేయడం కంటే మామూలు సినిమాలు చేసి హిట్ కొట్టడం మేలు అని నాచురల్ స్టార్ నాని అనుకుంటున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: