పునీత్ రాజ్ కుమార్ మరణించడానికి గల కారణాలు ఇవే..?

Divya
ఇప్పుడే అందిన తాజా వార్త. కన్నడ పవర్ స్టార్ అలాగే సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన పునీత్ రాజకుమార్ గుండెపోటుతో మరణించారు. ఇక ఈ విషయం తెలిసిన కొద్ది క్షణాలలోనే కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర మంతటా హై అలెర్ట్ విధించింది. పాఠశాలలు, కళాశాలల తో పాటు థియేటర్లు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ప్రభుత్వం రెండు రోజుల పాటు హాలిడే ని ప్రకటించింది. పునీత్ రాజ్ కుమార్ ఈరోజు ఉదయం జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఉండగా ఛాతీ మధ్యలో నొప్పి రావడంతో 9:30 గంటలకు బెంగళూరు జిల్లాలో ఉన్న కావేరి హాస్పిటల్ లో లో చేరారు.

స్పెషలిస్ట్ వైద్యబృందం అందరూ హుటాహుటిన ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తుండగా చికిత్స పొందుతూ ఆయన హఠాన్మరణం పొందారు. ఇక పెద్దఎత్తున సినీ తారలు, అభిమానులు కావేరి హాస్పిటల్ చుట్టూ మూగారు. ఇక కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అని వైద్యబృందం తేల్చిచెప్పడంతో కర్ణాటక రాష్ట్రం అంతా ఒక్కసారిగా మూగబోయింది.. ఈయన సినీ ఇండస్ట్రీలోకి 1980వ సంవత్సరంలో వసంత గీత అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన సింగర్ గా, యాంకర్ గా, నిర్మాతగా కూడా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.

ఇక పునీత్ డాన్స్ చూస్తే అల్లు అర్జున్ గుర్తొస్తారు అని అంటారు ఆయన అభిమానులు.. ఇక ఇంతటి గొప్ప నటుడిని సినీ ఇండస్ట్రీ కోల్పోయింది. పునీత్ రాజ్ కుమార్ మరణించడానికి గల కారణం ఏమిటి అని ఆరా తీయగా.. ఆయన బాడీని ఫిట్ గా ఉంచుకోవడం కోసం అవసరానికంటే ఎక్కువ వర్కౌట్స్ చేస్తూ.. ఎక్కువ సమయాన్ని జిమ్ సెంటర్ లోనే గడుపుతూ బాడీకి తీవ్రమైన ఒత్తిడిని కలుగజేసారట.. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఛాతిలో నొప్పి రావడం, వెంటనే హాస్పిటల్ కి తరలించడం, గుండెపోటుతో అక్కడికక్కడే మరణించడం జరిగింది. కేవలం ఈయన అధిక ఒత్తిడితో జిమ్లో వర్కవుట్ చేయడం వల్లే అతి చిన్న వయసు (46) లోనే గుండెపోటు మరణానికి కారణమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: