తమిళ హీరోలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. వారు నటించిన చాలా సినిమాలు తెలుగులో విడుదల కాగా ప్రేక్షకులలో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నారు వీరు. అలా గజినీ సినిమా నుంచి తన సినిమాలను విడుదల చేస్తూ సూర్య తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. తెలుగులో స్టార్ హీరోలకు ఉన్న మార్కెట్ ఆయనకు ఇప్పుడు ఉందని చెప్పవచ్చు. ఆయన సినిమా లకు భారీ స్థాయిలో వసూలు కూడా దక్కుతాయి. ఆ విధంగా ఆయన ద్విపాత్రాభినయంలో చేసిన చిత్రం 24 తెలుగులో భారీగా హిట్ అయ్యింది.
ఈ సినిమా కథ మొత్తం టైం ట్రావెలింగ్ చేసే ఒక వాచ్ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో హీరోగా విలన్ గా కూడా సూర్య స్వయంగా నటించడం విశేషం. తమ్ముడు కనిపెట్టిన వాచ్ స్వాధీనం చేసుకోవడానికి అన్న చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలోనే ఆ వాచ్ తమ్ముడు కొడుకు దగ్గర ఉండిపోతుంది. భారీ యాక్సిడెంట్ లో అన్నకు కాళ్ళు పోగా, తమ్ముడు చనిపోతాడు. అలా చిన్నతనం నుంచి ఆ వాచ్ తో పెరుగుతాడు హీరో. ఓ సారి సూర్య కు ఆ వాచ్ విలువ తెలుస్తుంది. దానిని ఉపయోగించుకుని తిరిగి తన తల్లిదండ్రులను ఎలా కలుసుకుని వారిని బ్రతికించాడు అనేదే ఈ సినిమా కథ.
కాన్సెప్ట్ బాగానే ఉన్న స్క్రీన్ ప్లే లో వచ్చిన లోపాల వల్ల ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కాకపోయినా ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయని చెప్పుకోవచ్చ సమంత హీరోయిన్ గా నటించగా ఇంకో హీరోయిన్ గా నిత్యామీనన్ నటించింది. ఏ ఆర్ రహమాన్ సంగీతం ఈ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. ఏదేమైనా విభిన్నమైన చిత్రాలు చేసే సూర్య తొలిసారిగా టైం ట్రావెలింగ్ సినిమా చేసి ప్రేక్షకులను అలరింపచేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించగా ఈ సినిమా ఆయన ప్రతిభకు నిదర్శనం. ఇందులో సూర్య త్రిపాత్రాభినయం లో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో థ్రిల్ కి గురి చేశాడు.