డ్యుయల్ రోల్ లో వచ్చిన ఉత్తమ తెలుగు చిత్రాలు..!!
1. విక్రమార్కుడు :
ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేసి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఒకవైపు కామెడీ , మరో వైపు మాస్ యాక్షన్ తో మాస్ మహారాజ గా మరోసారి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో ఒక పాత్రలో దొంగ గా కనిపించిన రవితేజ ,మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్గా ఇరగదీశాడు. అటు నటన పరంగా, ఇటు కథ పరంగా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా.
2. నాయక్:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. ఒక పాత్రలో కాలేజ్ స్టూడెంట్ గా ,మరో పాత్రలో యూత్ నాయకుడిగా నటించి యువతను బాగా ఆకర్షించాడు. ఇందులో అమలాపాల్, కాజల్ నటించి తమదైన శైలిలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.
3. మా అన్నయ్య:
యాంగ్రీ మాన్ రాజశేఖర్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం లో నటించి బాగా గుర్తింపు పొందాడు..అన్న అంటే తల్లి కంటే ఎక్కువ అని, కుటుంబం అంటే ఎలా ఉండాలి అనే చక్కని సారాంశం తో ఈ సినిమా తెరకెక్కడం జరిగింది. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను , యువతను కూడా బాగా ఆకట్టుకుంది.
4. అదుర్స్:
ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక సరికొత్త యాంగిల్లో ప్రేక్షకులకు కనిపించి మంచి వినోదాన్ని పంచాడు. అదుర్స్ సినిమాలో తనదైన శైలిలో నటించిన ఎన్టీఆర్ విశేష ప్రేక్షకాదరణ కూడా పొందాడు.
ఇక వీటితో పాటు ఖైదీ నెంబర్ 150, జెంటిల్ మెన్, చెన్నకేశవరెడ్డి, హలో బ్రదర్, పెదరాయుడు వంటి సినిమాలు లో హీరోలు పాత్రాభినయం చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.