అల్లరి నరేష్ కి ఇచ్చినట్లే ఆ హీరో కి మహేష్ బ్రేక్ ఇవ్వబోతున్నాడా!!

P.Nishanth Kumar
మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో అల్లరి నరేష్ తో ఓ కీలక పాత్ర చేయించి ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టడమే కాకుండా కోల్పోయిన ఫామ్ ను కూడా వచ్చేలా చేశాడు. ఆ చిత్రంలో నటించడం తోనే అల్లరి నరేష్ తన కెరియర్ ను మళ్లీ నిర్మించు కోగలిగాడు అని చెప్పవచ్చు. దానికి మహేష్ బాబు ఎంతో హెల్ప్ చేయగా అల్లరి నరేష్ ఆ వెంటనే నాంది అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆ విధంగా తనకు తెలియకుండానే మహేష్ బాబు అల్లరి నరేష్ కు మంచి బ్రేక్ ఇచ్చినట్టు అయింది.

అయితే ఇప్పుడు అల్లరి నరేష్ లాగానే మరొక హీరోకి కూడా మహేష్ బ్రేక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు 10 సంవత్సరాల క్రితం లవర్ బాయ్ గా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన హీరో తరుణ్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన హీరో తరుణ్ కు మహేష్ తన అప్ కమింగ్ సినిమాలో ఓ కీలకమైన పాత్ర లో నటించే ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. దాంతో అల్లరి నరేష్ కు ఇచ్చినట్లుగానే కూడా తరుణ్ కు కూడా మహేష్ కు బ్రేక్ ఇవ్వబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది.

బాల నటుడిగా సినిమాల్లోకి ప్రవేశించిన తరుణ్ హీరోగా నువ్వే కావాలి అనే సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో వరుసగా లవ్ స్టోరీ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తూ వచ్చాడు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో అనతి కాలంలోనే ఆయన స్టార్ హీరోగా మారాడు. కానీ ఆ తర్వాత మారిన ట్రెండ్ కు అనుగుణంగా సినిమాలు చేయకపోవడం వల్ల ఆయన సినిమాలను ప్రేక్షకులు చూడడం తగ్గించారు. దానికి తోడు ఇతర హీరోలు కూడా రావడంతో ఆయనకు సినిమా అవకాశాలు కరువయ్యాయి. దాంతో కనుమరుగైపోయిన తరుణ్ మధ్య లో కొన్ని సినిమాలు కూడా పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఇప్పుడు మహేష్ సినిమా అయినా ఆయనకు మంచి బ్రేక్ తీసుకు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: