అప్పట్లో ఆధ్యాత్మిక గురూజీ స్వామి నిత్యానంద అదేవిధంగా
టీవీ నటి రంజిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. స్వామి నిత్యానంద అప్పటికే తన బోధనలతో కొంత పాపులారిటీ సంపాదించగా టీవి నటి రంజితతో రాసలీలల వీడియో బయటకు వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత నిత్యానందపై పోలీసులు కన్నేసి అతడు ఓ పెద్ద
క్రిమినల్ అని గుర్తించారు. నిత్యానంద ఆశ్రమంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులు, ఏనుగు దంతాలు, అలాగే
పులి చర్మం ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి.
దాంతో పోలీసులు నిత్యానంద ఆశ్రమం లో రైడ్ చేయడంతో నిత్యానంద రెండేళ్లక్రితం ఏకంగా దేశాన్ని విడిచి ఎక్కడికో పారిపోయారు. ఇక ఇటీవల మళ్లీ వెలుగులోకి వచ్చిన స్వామి నిత్యానంద ఈక్వెడార్ పారిపోయి కైలాస దేశం ఏర్పాటు చేశాను అని కహానీలు చెప్పాడు. నిత్యానంద అక్కడే ఆశ్రమాన్ని పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా నిత్యానంద గురించి మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. నిత్యానంద తన వద్ద భక్తురాలిగా చేరిన
టీవీ నటి రంజిత ను వివాహం చేసుకున్నారట. అంతేకాకుండా రంజితను తన కైలాస దేశానికి ప్రధానిగా నిర్మించారట.
దాంతో ఇప్పుడు కైలాస దేశానికి నిత్యానంద రాజు కాగా రంజిత రాణిగా పూజలు అందుకుంటోంది. ఇక నిత్యానంద భక్తులు మాత్రం ఆయన
ఇండియా లో లేకపోవడం తో ఆన్లైన్ లో దర్శించుకుంటున్నారట. ఇదిలా ఉంటే రంజితకు ఇప్పటికే వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మొదట నిత్యానంద ఆశ్రమానికి భక్తురాలిగా వెళ్లి వార్తల్లో నిలిచిన రంజిత ఇప్పుడు ఏకంగా అతడిని
పెళ్లి చేసుకుంది అంటూ వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే అసాంగీక కార్యకలాపాలు నడిపిన నిత్యానంద ఎప్పుడు
భారత్ వస్తే అప్పుడు
అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.