ముంబైకి మకాం మార్చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ షాక్?

praveen
సాధారణంగా సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. దీని కోసం ఎన్నో ఏళ్ల పాటు వేచి చూస్తూ ఉంటారు. అయితే కేవలం సామాన్య ప్రజలకు మాత్రమే కాదు సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే ఆశ అటు సినీ సెలబ్రిటీలు కూడా ఉంటుంది. అదేంటి సినీ సెలబ్రిటీలకు ఏం తక్కువ.. ఆల్రెడీ సొంత ఇంట్లోనే ఉంటారు కదా అని అంటారా.. అయితే సొంత ఇంటిలోనే ఉన్నప్పటికీ.. కొన్ని కొన్ని ప్రాంతాలలో తమ అభిరుచులకు తగ్గట్లుగా ఇళ్లు కొనుగోలు చేయాలని కొంతమంది సినీ సెలబ్రిటీలు ఆశ పడుతూ ఉంటారు.



 ఇక దీని కోసం బాగా ఖర్చు చేయడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వివిధ పర్యాటక ప్రాంతాలలో తమ అభిరుచులకు తగ్గట్లుగా  కొన్ని ప్రాంతాలలో ఇల్లు  కొనుగోలు చేయడం లాంటివి చూస్తూ ఉంటారు. ఇక ఇలాంటి ఇంటిని కొనుగోలు చేయడానికి భారీగా ఖర్చు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు సినీ సెలబ్రిటీలు. ఇక ఇప్పుడు  టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా తన అభిరుచికి తగ్గట్టుగా ఒక ఇల్లు కొనేసింది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తన మకాం ముంబైకి మార్చేసింది. ఇటీవలే ముంబైలో ఒక ఇంటిని కొనుగోలు చేసింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు తన అభిరుచికి తగ్గట్టుగా ఆ ఇంటిని డిజైన్ చేసుకునే పనిలో ఉంది.


 ఇంటీరియర్ డిజైన్ కలర్ వంటి వాటిని దగ్గరుండి పర్యవేక్షిస్తుంది ఈ స్టార్ హీరోయిన్. ఇటీవలే దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. నా కలలను నిర్మించుకుంటున్నా అంటూ ఒక కామెంట్ కూడా జత చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే పూజా హెగ్డే తన అభిరుచులకు తగ్గట్టుగా ముంబై లో ఇల్లు కొనుగోలు చేయడంతో అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ లో  స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ అమ్మడి చూపు  ఎన్నో రోజుల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ పై పడింది అన్న టాక్ కూడా ఉంది. ఇక ఇప్పుడు తన మకాం కూడా ముంబయికి మార్చేయడంతో ఇక హీరోయిన్ టాలీవుడ్కు దూరం కాబోతుందా అన్న ఆలోచన అభిమానుల్లో మొదలయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: