అల్లు అర్జున్ పబ్లిసిటీలో ఆంతర్యం !
సాధారణంగా అల్లు అర్జున్ ఫంక్షన్స్ కు దూరంగా ఉంటాడు. కానీ ఈమధ్య వరసపెట్టి అతడు సినిమా ఫంక్షన్స్ కు రావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. గతవారం జరిగిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సక్సస్ మీట్ కు బన్నీ అతిధిగా రావడమే కాకుండా చాల యాక్టివ్ గా పాల్గొన్నప్పుడు ఆమూవీ తన తండ్రి గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించినది కావడంతో ఆ అనుబంధంతో బన్నీ వచ్చి ఉంటాడు అని అందరు భావించారు.
ఇప్పుడు ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడ అల్లు అర్జున్ అతిధిగా రావడమే కాకుండా ఆమూవీలో నటించిన నాగశౌర్య తదితర నటీనటుల పై ప్రశంసలు కురిపిస్తూ బన్నీ మాట్లాడిన తీరును పరిశీలించిన వారికి బన్నీ కూడ తాను అందరివాడుగా మారాలని ప్రయత్నిస్తున్నాడు అని అనిపించడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మరికొందరు ఈ విషయమై మరొక విధంగా స్పందిస్తున్నారు.
ఈమూవీ నిర్మాతలు బన్నీకి బ్లాక్ బష్టర్ హిట్ ఇచ్చిన ‘అల వైకుంఠపురములో’ నిర్మాతలు కావడంతో ఆ అభిమానం రీత్యా బన్నీ ఈమూవీ ఫంక్షన్ కు వచ్చి ఉంటాడు అని చెపుతున్నప్పటికీ బన్నీ వ్యూహాలను గమనిస్తున్న వారికి తాను ఇండస్ట్రీలో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని అన్న సంకేతాలు ఇస్తున్నాడు అని అనిపించడం సహజం అన్న అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. మరొకవైపు బన్నీ తన సొంత ప్రొడక్షన్ హౌస్ పై మీడియం రేంజ్ సినిమాలు తీసే ఉద్దేశ్యంలో ఉన్నాడు. వీటికోసం ఇలా బన్నీ పద్ధతిలో మార్పు వచ్చిందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..