కమెడియన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన
సునీల్ ప్రస్తుతం హీరోగా.. విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
కమెడియన్ గా సినిమాలలో నటించడం ఆపేసిన తర్వాత
సునీల్ పూర్తిగా హీరోగా నటిస్తూ సినిమాల్లో బిజీ అయ్యారు. అయితే అనుకున్న మేర విజయాలు రాకపోవడంతో మళ్ళీ మనసు మార్చుకుని
కామెడీ చేసేందుకు
సునీల్ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో విలన్ పాత్రలు కూడా రావడంతో కలర్ ఫోటో సినిమాలో ఆ ప్రయత్నం కూడా చేశాడు. ఇక తన విలనిజంకు కూడా మంచి క్రేజ్ రావడంతో ప్రస్తుతం పుష్ప సినిమాలో కూడా
సునీల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మరోసారి
సునీల్ హీరోగా ఓ
సినిమా చేసేందుకు ఒప్పుకున్నడు. దర్జా అనే సినిమాలో
సునీల్ హీరోగా నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
అంతేకాకుండా దర్జా సినిమాకు సంబంధించిన లోగో... టైటిల్ లను ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ
సినిమా షూటింగ్ ఏర్పాట్లు కూడా పూర్తయినట్టు సమాచారం. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే అవకాశాలున్నాయని ఫిల్మ్
నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఓ విభిన్నమైన పాత్రలో
సునీల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. తన ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమాలో
సునీల్ కనిపించబోతున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాలో కు జోడీగా
జబర్దస్త్ బ్యూటీ యాంకర్
అనసూయ నటించబోతున్నట్లు ఫిల్మ్
నగర్ లో టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం వీరిద్దరూ కూడా పుష్ప సినిమాలో నటిస్తుండగా ఇప్పుడు ఒకే సినిమాలో
హీరో హీరోయిన్ గా నటించడం ఆసక్తి రేపుతోంది. యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన
అనసూయ అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పటికే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు ఏకంగా
సునీల్ సినిమాలో
హీరోయిన్ గా
అనసూయ ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు
అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు
హీరోయిన్ గా రంగమ్మత్త ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి