కొంతమంది హీరోయిన్ లు ఎక్కువ సినిమాలు చేయకపోయినా కూడా అగ్ర దర్శకుల కళ్లలో పడి పోతూ ఉంటారు. వారి అభినయం గ్లామర్ ఏంటో తెలియడానికి వారికి పెద్దగా సమయం అవసరం లేదు. సినిమాలు విడుదల కావాల్సిన అవసరం కూడా లేదు. ట్రైలర్ టీజర్ లతోనే వారు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేస్తారు. ఆ విధంగా పెళ్లిసందడి సినిమాకు సంబంధించిన హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లతోనే తన అందంతో అందర్నీ ఆకట్టుకుని ఎవరీ అమ్మాయి అని అనిపించుకుంది.
దసరా సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ చిత్రంలో హీరోగా నటించగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో ముఖ్య పాత్రలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ చిత్రంలో అందరి తో పోల్చుకుంటే శ్రీ లీల ప్రేక్షకులను బాగా అలరింల చేసిందని తెలుస్తోంది. తన అందం తో గ్లామర్ తో యాక్టింగ్ తో అన్ని విభాగాల్లో అలరించింది. ఈ సినిమా తర్వాత వేరే రేంజ్ లో ఈ టాలెంటెడ్ బ్యూటీకి మంచి పాపులారిటీ వచ్చింది.
అయితే ఈ సినిమాలో ఆమెకు నటిగా మంచి పేరు రాగా దానితో పాటు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పటికే రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న చిత్రం కోసం ఈమె నే హీరోయిన్ గా అనుకొగా ఆమె కోసం దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేకపోవడంతో పెద్ద సినిమా ఆఫర్ కావడంతో ఈ చిత్రాన్ని ఒప్పుకునే దిశగా ఆమె ముందుకు పోతుంది. అలాగే మరొక హీరో సరసన కూడా ఈమె నటించబోతుంది. ఛలో భీష్మ చిత్రాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఉన్న వెంకీ కుడుముల త్వరలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో సినిమా రూపొందించబోతున్నాడు. ఈ చిత్రంలో ఈమె హీరోయిన్ గా ఎంపిక అవుతుందని తెలుస్తుంది. మరి భవిష్యత్తులో ఈ అందం ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.